Home /News /business /

SBI Easy Ride: టూవీలర్ కొనాలా? ఎస్‌బీఐ నుంచి ఈజీ రైడ్ స్కీమ్

SBI Easy Ride: టూవీలర్ కొనాలా? ఎస్‌బీఐ నుంచి ఈజీ రైడ్ స్కీమ్

SBI Easy Ride: టూవీలర్ కొనాలా? ఎస్‌బీఐ నుంచి ఈజీ రైడ్ స్కీమ్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Easy Ride: టూవీలర్ కొనాలా? ఎస్‌బీఐ నుంచి ఈజీ రైడ్ స్కీమ్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Easy Ride | లోన్ తీసుకొని వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రీ-అప్రూవ్డ్ వెహికిల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    దీపావళి రోజున టూవీలర్ కొనాలనుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఎస్‌బీఐ ఈజీ రైడ్' పేరుతో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లు ఈ స్కీమ్ ద్వారా వెహికిల్ లోన్‌కు (Vehicle Loan) దరఖాస్తు చేయొచ్చు. కనీసం రూ.20,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. వార్షిక వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. క్రెడిట్ స్కోర్ (Credit Score) బాగా ఉన్నవారికి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యోనో ఎస్‌బీఐ (Yono SBI) ద్వారా కస్టమర్లు వెహికిల్ లోన్‌కు అప్లై చేయొచ్చు. వాహనం ఆన్ రోడ్ ధరలో 85 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు కొనాలనుకున్న వాహనం ఆన్ రోడ్ ధర రూ.1,00,000 ఉంటే రూ.85,000 వరకు లోన్ వస్తుంది. మిగతా మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి.

    Aadhaar Violation: ఆధార్ వివరాలు దుర్వినియోగం చేస్తే కోటి రూపాయల జరిమానా

    'ఎస్‌బీఐ ఈజీ రైడ్' వెహికిల్ స్కీమ్ ద్వారా వాహన రుణం పొందడానికి కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. నాలుగేళ్ల టెన్యూర్‌తో రూ.3,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఇక ఈఎంఐ విషయానికి వస్తే రూ.1 లక్షకు కేవలం రూ.2,560 ఈఎంఐ చెల్లిస్తే చాలని ఎస్‌బీఐ చెబుతోంది. లోన్ నేరుగా డీలర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. మరి ఎస్‌బీఐ కస్టమర్లు 'ఎస్‌బీఐ ఈజీ రైడ్' వెహికిల్ లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    Blue Color Aadhaar: బ్లూ కలర్‌లో ఆధార్ కార్డ్... ఎవరికి? ఎందుకు? తెలుసుకోండి

    SBI Easy Ride: ఎస్‌బీఐ ఈజీ రైడ్ లోన్‌కు అప్లై చేయండి ఇలా


    ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.
    బ్యాంక్ అకౌంట్ వివరాలతో యాప్‌లో లాగిన్ కావాలి.
    హోమ్ పేజీలో 'ఎస్‌బీఐ ఈజీ రైడ్' లోన్ బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత కస్టమర్ తమ వివరాలను ఎంటర్ చేయాలి.
    కొనాలనుకుంటున్న వాహనం, తీసుకోవాలనుకుంటున్న లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
    వెహికిల్ ఎస్టిమేషన్ వివరాలు, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    చివరగా సబ్మిట్ చేస్తే లోన్ నేరుగా డీలర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

    ఇది ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కాబట్టి అందరికీ ఈ ఆఫర్ వర్తించదు. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తించేవారికి ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ వస్తుంది. లేదా కస్టమర్లు తమ యోనో ఎస్‌బీఐ యాప్‌లో చెక్ చేయొచ్చు. యోనో ఎస్‌బీఐ యాప్‌లో ప్రీఅప్రూవ్డ్ పర్సనల్ లోన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. గోల్డ్ లోన్, కార్ లోన్ లాంటి ఆఫర్స్ కూడా ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loan, Bank loans, Personal Finance, Personal Loan, Sbi, State bank of india

    తదుపరి వార్తలు