Home /News /business /

STATE BANK OF INDIA ANNOUNCED CAR LOAN PERSONAL LOAN AND GOLD LOAN WITH ZERO PROCESSING FEES SS

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Loan | పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, వెహికిల్ లోన్ (Vehicle Loan) తీసుకోవాలనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంచి ఆఫర్ ఇస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణాలు మంజూరు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రాఖీ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకునేవారికి మంచి ఆఫర్ ఇస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ రుణాలు తీసుకోవచ్చని ప్రకటించింది. రూ.1 లక్ష కార్ లోన్‌కు రూ.1,546 ఈఎంఐ, రూ.1 లక్ష పర్సనల్ లోన్‌కు రూ.1,858 ఈఎంఐ, రూ.1 లక్ష గోల్డ్ లోన్‌కు రూ.3,125 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందో ఎస్‌బీఐ వివరించలేదు. రాఖీ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ కాబట్టి త్వరలోనే ఈ ఆఫర్ ముగియొచ్చు. కస్టమర్లు ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి లేదా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ రుణాలకు అప్లై చేయొచ్చు.

SBI Personal Loan: ఎస్‌బీఐ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10.10 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. వేర్వేరు వర్గాలకు వేర్వేరు వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఎస్‌బీఐ డిఫెన్స్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగులకు వేర్వేరు లోన్ స్కీమ్స్ అందిస్తోంది. స్కీమ్‌ను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.

IRCTC Ramayan Yatra: అయోధ్య చూస్తారా? హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర... ప్యాకేజీ వివరాలివే


SBI Auto Loan: ఎస్‌బీఐ ఆటో లోన్ వడ్డీ రేట్లు 7.75 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. ఎస్‌బీఐ కార్ లోన్, ఎన్ఆర్ఐ కార్ లోన్, లాయల్టీ కార్ లోన్, గ్రీన్ కార్ లోన్, టూవీలర్ లోన్ పేరుతో వేర్వేరు స్కీమ్స్‌ని అందిస్తోంది ఎస్‌బీఐ. కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేటు మారుతుంది.

SBI Gold Loan: ఎస్‌బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7.80 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. ఎస్‌బీఐ పర్సనల్ గోల్డ్ లోన్, ఎస్‌బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ స్కీమ్స్ ద్వారా బంగారంపై రుణాలను అందిస్తోంది బ్యాంకు. కస్టమర్లు తమ అవసరాలకు నగల్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవచ్చు.

Aadhaar Center: రైల్వే స్టేషన్‌లో ఆధార్ సెంటర్... ఈ సేవలు ఉచితం

ఎస్‌బీఐ కస్టమర్లు యోనో ఎస్‌బీఐ ప్లాట్ ఫామ్ ద్వారా రుణాలకు అప్లై చేయొచ్చు. యోనో ఎస్‌బీఐ యాప్ లేదా వెబ్‌సైట్‌లో సులువుగా లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.



Step 1- కస్టమర్లు ముందుగా యోనో యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 2- తమ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేయాలి.

Step 3- ఇప్పటికే యోనో యాప్‌లో రిజిస్టర్ అయినవారు నేరుగా లాగిన్ చేయాలి.

Step 4- లాగిన్ చేసిన తర్వాత లోన్ ఆప్షన్స్‌లో వేర్వేరు లోన్స్ ఉంటాయి.

Step 5- తమకు కావాల్సిన లోన్ పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత లోన్ ఎంతకావాలో ఎంటర్ చేసి, టెన్యూర్ ఎంచుకోవాలి.

Step 7- సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 8- పర్సనల్ లోన్ అయితే వెంటనే మంజూరవుతుంది. ఇతర లోన్లకు బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank loan, Car loans, Gold loans, Personal Finance, Personal Loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు