కరోనా మహమ్మారి ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా సంక్షోభంలోనే ఉంది. వ్యాపార వాణిజ్యాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేటును రికార్డు స్థాయిలో 4 శాతం వద్ద ఉంచింది. రుణాలు పెంచి, ఆర్థిక పునరుజ్జీవానికి ఊతమిచ్చేందుకు గాను రెపో రేటును తగ్గించింది. దీనివల్ల బ్యాంకులు గృహరుణాలపై వడ్డీరేట్లను దశాబ్దాల కనిష్ఠానికి తగ్గించాయి. కోవిడ్-19 ప్రభావం వల్ల ఎదురైన పెద్ద పెద్ద ఎదురుదెబ్బలను అధిగమించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రియాల్టీ రంగం కొన్ని ధరల సర్దుబాట్లు చేసింది. వీటివల్ల గృహనిర్మాణ మార్కెట్ కొనుగోలుదారులకు అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీకు అవసరమైన మార్జిన్ డబ్బు, స్థిరమైన ఆదాయం తగినంద ఆకస్మిక పొదుపు ఉంటే మీరు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి మీ ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ఖరారు చేసుకోవచ్చు. అంతేకాకుండా తక్కువగా ప్రాపర్టీ ధరలు ఉండవచ్చు.
ఇంటిని కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికులు ఇక్కడ పరిగణించాల్సిన మరో విషయం క్రెడిట్ స్కోరు. గతంతో కంటే క్రెడిట్ స్కోరు సందర్భోచితంగా మారింది. బ్యాంకులు ప్రవేశపెట్టిన ఈ రెపో లింక్డ్ గృహరుణాలు సాధారణ క్రెడిట్ రిస్క్ మార్జిన్ ను కలిగి ఉంటాయని వారు అర్థం చేసుకోవాలి. బ్యాంక్ బజార్ ప్రకారం సాధ్యమైనంత వడ్డీరేట్లు క్రెడిట్ల స్కోర్ల(750-800) ఆధారంగా దరఖాస్తుదారులక కేటాయిస్తారు.
SBI Cheque Book: ఎస్బీఐ చెక్ బుక్ కావాలా? ఆన్లైన్లో అప్లై చేయండిలా
PM Kisan Scheme: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం
మంచి, పేలవమైన క్రెడిట్ స్కోర్ల మధ్య వ్యత్యాసం 100 బేసిస్ పాయింట్ల ఉన్నందున ఔత్సాహికులను పరిగణనలోకి తీసుకుంటే సాధ్యమైనంత తక్కువ రేట్లు పొందడానికి మీ క్రెడిట్ స్కోర్లు మంచివని నిర్ధారించుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. గృహరుణం తీసుకోవడానికి ప్రణాళికను పరిశీలిస్తే ప్రస్తుతం 7 శాతం నుంచి ప్రారంభమయ్యే ఫ్లోటింగ్ రేటు గృహరుణాలను అందిస్తున్న 15 బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది. మీకు వర్తించే వడ్డీరేటు మీరు ఎంచుకున్న ఆస్తి పరిమాణం, స్థానం, వయస్సు, ఆదాయం, లింగం, క్రెడిట్ స్కోరు, రుణమొత్తం నిర్దేశించిన ఇతర నిబంధనలు, షరతులపై నిర్ణయించబడుతుంది.
భవిష్యత్తులో ఆర్బీఐ రేపోరేటును పెంచినప్పుడు రెపో లింక్డ్ రుణాల ఈఎంఐలు దామాషా ప్రకారం పెరుగుతాయి. కాబట్టి రేట్లు తక్కువగా ఉన్నప్పుడు త్వరగా రుణ రహితంగా మారడానికి ఈఎంఐ చెల్లింపులతో పాటు వీలైనంత ఎక్కువ పార్ట్ ప్రీపెయిమెంట్లు కూడా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హోంలోన్లపై తక్కువ వడ్డీరేట్లను అందించే కొన్ని బ్యాంకులు, వాటి వడ్డీ శాతాలు ఇప్పుడు చూద్దాం.
Jio Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
Paytm Instant Personal Loan: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్
తక్కువ వడ్డీరేటుకే గృహరుణాలు అందించే బ్యాంకులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంకు- 6.75 నుంచి 8.45 శాతం
యూనియన్ బ్యాంక్- 6.80 నుంచి 7.40 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.80 నుంచి 7.75 శాతం
HDFC బ్యాంకు- 6.80 నుంచి 7.85 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.80 శాతం
సెంట్రల్ బ్యాంకు- 6.85 నుంచి 7.30 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85 నుంచి 8.20 శాతం
యూసీఓ బ్యాంక్- 6.90 నుంచి 7.25 శాతం
పంజాబ్, సింధ్ బ్యాంకు- 6.90 నుంచి 7.60 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్- 6.90 నుంచి 8.05 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 6.90 నుంచి 8.40 శాతం
యాక్సిస్ బ్యాంక్- 6.90 నుంచి 8.55 శాతం
కెనరా బ్యాంక్- 6.90 నుంచి 8.90 శాతం
ఐడీబీఐ బ్యాంక్- 6.90 నుంచి 9.90 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6.95 నుంచి 8.35 శాతం