ATM: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

ATM Cardless Withdrawal | ఎస్‌బీఐ కస్టమర్లు దేశంలోని అన్ని ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంకు కూడా 'కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్' పేరుతో ప్రారంభించింది.

news18-telugu
Updated: January 31, 2020, 4:18 PM IST
ATM: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ATM: ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? మీకు ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే మీకు శుభవార్త. మిగతా ఏ బ్యాంకులు ఇవ్వని ప్రత్యేకమైన సేవల్ని ఈ రెండు బ్యాంకులు కస్టమర్లకు అందిస్తున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డు వాడాల్సిన అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసే ప్రత్యేకమైన సేవలు ఇవి. వాస్తవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాదే 'ఎస్‌బీఐ యోనో క్యాష్' పేరుతో ఈ సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ కస్టమర్లు దేశంలోని అన్ని ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో క్యాష్ యాప్ ఉండాలి. ఏటీఎం కార్డు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్‌బీఐ యోనో క్యాష్ లాగా కొద్ది రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంకు కూడా 'కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్' పేరుతో ప్రారంభించింది. దేశంలోని 15,000 ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక రోజులో రూ.20,000 మాత్రమే డ్రా చేసే అవకాశం ఉందు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు iMobile యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఏటీఎంలో ఎంత డ్రా చేయాలో ముందుగా యాప్‌లో ఎంటర్ చేస్తే ఎస్ఎంఎస్‌లో పిన్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన వివరాలు, 4 అంకెల టెంపరరీ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం ఈ సేవల్ని కేవలం రెండు బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి



EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ

PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Jobs: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు