Home /News /business /

SBI Alert: ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్... క్యాష్‌బ్యాక్... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

SBI Alert: ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్... క్యాష్‌బ్యాక్... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

SBI Alert: ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్... క్యాష్‌బ్యాక్... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్... క్యాష్‌బ్యాక్... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా? (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. ఇటీవల ఎస్‌బీఐ నుంచి ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ కూపన్స్ పేరుతో కస్టమర్లకు వస్తున్న మెసేజ్‌లు, ఇమెయిల్స్‌తో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది బ్యాంకు.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఫ్రీ గిఫ్ట్స్ అందుకోండి అని మీకు మెసేజ్ వచ్చిందా? ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ (SBI Cashback) అందిస్తోందని మెయిల్ వచ్చిందా? ఎస్బీఐ అందించే ఉచిత ప్రొడక్ట్స్ మీరూ సొంతం చేసుకోండంటూ ఎవరైనా కాల్ చేశారా? ఎస్‌బీఐ కూపన్స్ (SBI Coupons) రీడీమ్ చేసుకోండి అంటూ వాట్సప్‌లో మెసేజ్ వచ్చిందా? అయితే అలర్ట్. ఇవన్నీ మోసాలే. మీరు ఇలాంటి మెసేజెస్, ఇమెయిల్స్‌ని నమ్మితే దారుణంగా మోసపోతారు. మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి అంటూ కస్టమర్లను హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ క్యాష్‌బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, ఫ్రీ కూపన్స్ పేరుతో వచ్చే మెసేజెస్, ఇమెయిల్స్ నమ్మొద్దని వార్నింగ్ ఇస్తోంది. సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది ఎస్‌బీఐ.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగా గిఫ్ట్స్ ఇవ్వదు. ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటించదు. కూపన్స్ కూడా ఇవ్వదు. ఒకవేళ ఇలాంటి ఆఫర్స్ ఏవైనా ఉంటే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ద్వారా సమాచారం ఇస్తుంది. అంతే తప్ప వాట్సప్ మెసేజెస్, టెక్స్‌ట్ మెసేజెస్, ఇమెయిల్స్ ద్వారా సమాచారం ఇవ్వదు.

    IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు అదుర్స్ (Photos)


    ఒకవేళ మీకు ఎస్‌బీఐ పేరుతో గిఫ్ట్స్, క్యాష్‌బ్యాక్స్, కూపన్స్ లాంటి మెసేజెస్, మెయిల్స్ వస్తే అస్సలు పట్టించుకోవద్దు. ఇది సైబర్ నేరగాళ్లు వేసే వల. మీరు క్లిక్ చేశారంటే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కార్డు డీటెయిల్స్ తెలుసుకొని సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. అందుకే ఈ మెసేజెస్ పట్టించుకోవద్దు.

    Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‍లో రోజూ రూ.50 దాచుకుంటే రూ.35 లక్షల వరకు రిటర్న్స్

    ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు చెప్పమని అడిగితే చెప్పొద్దు. బ్యాంకు సిబ్బంది ఎవరూ అకౌంట్ వివరాలు అడగరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు లోన్లు, ఇతర ఆఫర్ల గురించి సమాచారం కావాలంటే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ చూడాలి. లేదా సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. ఆఫర్స్ వివరాలు అక్కడ తెలుసుకోవచ్చు.

    ఆఫర్స్ పేరుతో మీకు మెసేజెస్, మెయిల్స్ వస్తే మీరు http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ టోల్‌ఫ్రీ నెంబర్స్ అయిన 18004253800, 1800112211 నెంబర్స్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Cyber criminals, CYBER FRAUD, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు