Lockdown Startup: 10 నెలల్లో 20 లక్షల్లో సంపాదన.. చిన్న ఆన్ లైన్ వ్యాపారంతో గొప్ప లాభాలు..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

చిన్న వ్యాపారంగా ప్రారంభమైన ఈ డామీ ఆన్ లైన్ ప్లాట్ ఫాంను నేడు దేశవ్యాప్తంగా విస్తరించాడు సంజోగ్. డార్జిలింగ్, సిలిగురీ ప్రాంతంలో ఉండే కుటీర పరిశ్రమల నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సేకరించి వాటిని ఆన్ లైన్ వేదికగా విక్రయిస్తాడు.

  • Share this:
ఈ-కామర్స్ రంగం రోజురోజుకు ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగాన్ని ఎంచుకొని ఎంతో మంది మంచి లాభాలు పొందుతున్నారు. అయితే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్ ఫోన్ ఇతర గృహోపకరణాల ద్వారా ఎక్కువగా లాభం పొందవచ్చు. వీటితో పోల్చితే వ్యవసాయ ఉత్పత్తుల్లో లాభాలు తక్కువేనని చెప్పుకోవాలి. కానీ డార్జిలింగ్ కు చెందిన 30 ఏళ్ల సంజోగ్ దత్తా మాత్రం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు తన పట్టణమైన కర్సియోంగ్ లో విలేకరిగా, రాజకీయ సలహాదారుగా పనిచేసిన ఇతడు ఇప్పుడు డామీ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. వీటిద్వారా డార్జిలింగ్ లో ఎక్కువగా పండే తేయాకుతో పాటు మిర్చిని విక్రయిస్తున్నాడు.

లాక్ డౌన్ లో ప్రారంభం..
చిన్న వ్యాపారంగా ప్రారంభమైన ఈ డామీ ఆన్ లైన్ ప్లాట్ ఫాంను నేడు దేశవ్యాప్తంగా విస్తరించాడు సంజోగ్. డార్జిలింగ్, సిలిగురీ ప్రాంతంలో ఉండే కుటీర పరిశ్రమల నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సేకరించి వాటిని ఆన్ లైన్ వేదికగా విక్రయిస్తాడు. లాక్ డౌన్ తర్వాత డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యామని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నుంచి వచ్చిన కుటుంబాలు ఎంతో ఇబ్బందికి లోనయ్యారని చెప్పాడు. వారికి ఏదోక రకంగా సహాయం చేయాలనే తలంపుతో దేశవ్యాప్తంగా ఈ ఆన్ లైన్ వేదికను ప్రారంభించామని, ఇందుకోసం కొంతమంది తయారీదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంజోగ్ వివరించాడు. ఈ డామీ అంతర్జాల వేదికను సంజోగ్ 2020 మే 24న స్థాపించాడు. డామీ అంటే నేపాలీ భాషలో అత్యుత్తమం అని అర్థం. దీన్ని స్థాపించేందుకు తన తల్లి అయిన రంచనా దత్తా సహకరించిందని సంజోగ్ తెలిపాడు. కోల్ కత్తాలోని సెయింట్ జేవియర్ కాలేజీ వేదికగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు చెప్పాడు. కొత్త కొత్త వ్యూహాలు అవలంబించడం తమకు పెద్ద సవాలుగా మారిందని.. ఎందుకంటే తమ వద్ద పెద్ద బడ్జెట్ లేదని చెప్పాడు. అయితే వినియోగదారుల ఫీడ్ బ్యాక్ నుంచి సరఫరాను చాలా వరకు క్రమబద్ధీకరించామని తెలిపాడు.

డామీలో ఏయే ఉత్పత్తులు ఉంటాయి..
పర్వత ప్రాంతంలో లభ్యమయ్యే చాలా ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు, నేపాలీ సంస్కృతిని ప్రతిబింభించే వస్త్రాలు ఇందులో ఉంటాయి. వివిధ రకాల ఆహార ఉత్పత్తులు లభ్యమవుతాయి. డాల్లే(గుండ్రని మిరపకాయలు), చైనీస్ సాస్, గండ్రక్(నేపాల్లో లభించే ఆకు కూర), స్మోక్డ్ పోర్క్, మటన్ పికిల్, ఆక్సోన్, చుర్పీ చీజ్(హిమాలయ ప్రాంతాల్లో లభించే సంప్రదాయ వెన్న), తుక్పా నూడిల్స్ లాంటివి ఇందులో కొనుగోలు చేయవచ్చు. వీటిలో మీట్ పికిల్స్, కాలిపాంగ్ నూడిల్స్, టిటావురా(ఫేమస్ నేపాల్ స్నాక్స్), చుర్పీ బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదట కాలిపాంగ్, డార్జిలింగ్, కార్సియోంగ్ పట్టణాల్లో డెలివరీ చేయగా.. ప్రస్తుతం వివిధ నగరాలకు విస్తరించినట్లు సంజోగ్ తెలిపాడు. "మేము తయారీదారుల నుంచి ప్రత్యక్షంగా కొనుగోలు చేసి గోడౌన్లకు తరలిస్తాం. నాణ్యత విషయంలో రాజీలేకుండా అక్కడ చెక్ చేసి వాటిని దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తాం. ఇవికాకుండా మా ప్యాకేజింగ్ కూడా ఎంతో నాణ్యంగా ఉంటుంది. మా ఉత్పత్తుల్లో 90 శాతం ఇండియా మొత్తం చేరవేస్తాం. అయితే మా అతిపెద్ద మార్కెట్ మెట్రో నగరాలే" అని సంజోగ్ స్పష్టం చేశాడు.
ఒకప్పుడు వార్తా కథనాల వెనక పరుగు తీసిన సంజోగ్ ప్రస్తుతం వివిధ రకాల ఉత్పత్తులను చేరవేయడానికి పరుగులు తీస్తున్నాడు. కేవలం 12 మంది సభ్యులు కలిగిన ఈయన బృందం వివిధ రకాల ఉత్పత్తులను వేగంగా చేరవేయడంలో కృషి చేస్తున్నారు. డార్జిలింగ్, కాలింపాంగ్, కార్సియోంగ్ లాంటి రిమోట్ ఏరియాలకు చెందిన ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తనకు ఎంతో సంతృప్తి కలగజేస్తుందని సంజోక్ చెప్పాడు. అయితే చెన్నై, బెంగళూరు, ముంబయి ప్రాంతాల్లో వారికి అందుబాటులో లేనప్పటికీ వేలాది మంది ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను చేరవేస్తున్నామని స్పష్టం చేశాడు.

కొద్దికాలంలో మెరుగైన లాభాలు..
"కస్టమర్ కు వీలైనంత వేగంగా వస్తువులు చేరవేయాలనే విధానమే మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచింది. మా ప్రధాన క్లయింట్ మెట్రో నగరాల ప్రజలే. వారికి ఇలాంటి వస్తువులు లభించవు. అంతేకాకుండా మా ఉత్పత్తులన్నీ పూర్తి నాణ్యమైనవి, వాటిని బాగా చెక్ చేసిన తర్వాతే లోడింగ్ చేస్తాం. మా సిబ్బంది కూడా ఎంతో మద్దతుగా ఉంటారు. కొన్ని ఆర్డర్లలో అక్కడక్కడ లోపాలు జరిగినప్పటికీ ఎక్కువ శాతం మెరుగైన ఫలితాలనే సాధించాం. నిరంతరం వృద్ధి చెందుతున్నాం. ఎంతలా అంటే 10 నెలల కాలంలో మా అమ్మకాలు రూ.20 లక్షల దాటాయి. 10 నెలల్లో కంపెనీకి ఈ సంఖ్య అంత పెద్దదిగా అనిపించకపోవచ్చు. వీటిపై మా లాభాలు 3 శాతం మాత్రమే. మొదట్లో వస్తువులను సిలిగురిలోనే పంపిణీ చేసేవాళ్లం.

క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి...

ఈ నెల నుంచి కోల్ కతాకు విస్తరించాం. ఆర్డర్ ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లోనే వస్తువులను పంపిణీ చేస్తాం. ఇతర రాష్ట్రాలపై కూడా దృష్టి కేంద్రీకరించనున్నాం" అని సంజోగ్ తెలిపాడు.
First published: