ఖర్చు తగ్గించడం కోసమే ఉద్యోగుల తొలగింపులు, నిర్బంధ సెలవులకు (Employees Layoff) పూనుకుంటున్నామని స్టార్టప్ (Startup) కంపెనీలు గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నాయి. ఈ కారణమే చూపుతూ చాలా స్టార్టప్ కంపెనీలు(Start Up Companies) భారీ సంఖ్యలో ఉద్యోగులను జీతాల నుంచి తప్పించాయి. అయితే ఎంప్లాయిస్(Employees) లేఆఫ్‌లకు ప్రధాన కారణం ఇది కాదని వెంచర్ ఇంటెలిజెన్స్(Intelligence) డేటా తాజాగా స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో ఈ స్టార్టప్ సంస్థలకు మొత్తం నిధులు (Overall Funding) గతేడాదితో సమానంగా ఉన్నాయని డేటా(Data) తెలుపుతోంది. 100 మిలియన్ డాలర్లకు(Dollars) పైగా సేకరించిన కంపెనీల సంఖ్య కూడా గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని డేటా సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న అస్థిర మార్కెట్ పరిస్థితుల కారణంగా బిగ్-టికెట్ ఫండింగ్ మందగించడంతో లాభదాయకతను పెంచుకోవడం కోసం నగదును ఆదా చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెంచర్ ఇంటెలిజెన్స్ నుంచి సేకరించిన డేటా ప్రకారం, గతేడాది జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో పెట్టుబడిదారులు 11.2 బిలియన్ డాలర్లను స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది అదే కాలంలో స్టార్టప్ సంస్థల్లో సుమారు 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. దీన్నిబట్టి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడులు 100 మిలియన్ డాలర్లు పెరిగాయని తెలుస్తోంది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం, జనవరి-ఏప్రిల్ 2022లో దాదాపు 33 కంపెనీలు 100 మిలియన్ డాలర్లను లేదా అంతకంటే ఎక్కువ నిధులను సేకరించాయి. అయితే గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 29గా ఉంది.
అన్అకాడమీ, కార్స్24, వేదాంతాతో సహా ఇండియాలోని ప్రముఖ స్టార్టప్‌లు ఈ సంవత్సరం 5,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఓలా ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో దాదాపు 2,100 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత అన్అకాడమీ 600 మందికి పైగా, కార్స్24 600 మందిని, వేదాంతు 400 ఉద్యోగులను తీసేసింది. ఈ-కామర్స్ సంస్థ మీషో 150 మంది ఉద్యోగులను, ఫర్నిచర్ రెంటల్ స్టార్టప్ ఫుర్లెంకో 200 మందిని, ట్రెల్ 300 మంది ఉద్యోగులను, ఓకే క్రెడిట్ 40 మంది ఉద్యోగులను తొలగించింది.
“ప్రస్తుత అస్థిర మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, స్టార్టప్‌లు నగదును ఆదా చేయడం, లాభదాయకతను పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మూలధన కొరత ఆందోళనల (Capital Crunch Worries) కారణంగా స్టార్టప్‌ల తొలగింపులు వేగవంతమై ఉండవచ్చు." అని ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అడ్వైజరీ) అజయ్ మాలిక్ పేర్కొన్నారు.
వెంచర్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ డేటా ప్రకారం, జనవరి-ఏప్రిల్ 2022లో 33 భారతీయ స్టార్టప్‌లు సుమారు 7.34 బిలియన్ యూఎస్ డాలర్లను సేకరించాయి. అయితే, ఇండియన్ టెక్ యునికార్న్ రిపోర్ట్ 2021 ప్రకారం 2021లో కేవలం 11 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఆఫర్ల ద్వారా 7.16 బిలియన్ డాలర్లు సేకరించాయి. డేటా ప్రకారం, జనవరి-ఏప్రిల్ 2021లో 100 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ విలువైన 29 డీల్‌లు మొత్తం ప్రారంభ పెట్టుబడులలో 71 శాతం కవర్ చేశాయి, అయితే ఈ సంవత్సరం 33 డీల్‌లు మొత్తం నిధులలో కేవలం 60 శాతం మాత్రమే సేకరించ గలిగాయి.
మాలిక్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జనవరి-ఏప్రిల్‌లో గతేడాది మాదిరిగానే దాదాపు అదే నిధులను చూసిందని... అయితే గతేడాదితో పోలిస్తే టాప్ డీల్స్‌తో కూడిన మొత్తం తక్కువగా ఉందన్నారు. "తగ్గుతున్న వాల్యుయేషన్లు, ఫండింగ్ రౌండ్లు మందగించడం, డీల్ పరిమాణాలు తగ్గిపోవడం వంటి స్టార్టప్‌ల కష్టాలకు దారితీస్తున్నాయి" అని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో ప్రతికూల మార్కెట్ వాతావరణం వల్ల నిధులు మందగించవచ్చని అభిప్రాయపడ్డారు.
కంపెనీలకు సీక్వోయా క్యాపిటల్స్ నోట్
51-పేజీల నోట్లో ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ సీక్వోయా క్యాపిటల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత లాభదాయకతను చూపిస్తున్న కంపెనీల వైపే పెట్టుబడిదారులు మళ్లుతున్నారని.. స్టార్టప్స్ హైపర్గ్రోత్ నమోదుచేసే యుగం ముగుస్తుందని సీక్వోయా పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.