హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Business: కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ 4 టిప్స్ తప్పక పాటించండి

New Business: కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ 4 టిప్స్ తప్పక పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా విపత్కర పరిస్థితులు కొంత మందిని సొంత వ్యాపారం ప్రారంభించేలా ప్రేరేపించాయి. ఇటీవల ఇది ట్రెండ్‌గా మారింది. చాలా మంది సొంత వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ టిప్స్  తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చాలా సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత విధించాయి. జీతాలు నిలిపేశాయి. కొన్ని అరకొర జీతాలను చెల్లిస్తూ వస్తాయి. ఈ క్రమంలో చాలా మంది కొలువులు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు కొంత మందిని సొంత వ్యాపారం ప్రారంభించేలా ప్రేరేపించాయి. ఇటీవల ఇది ట్రెండ్‌గా మారింది. చాలా మంది సొంత వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ టిప్స్ తెలుసుకోండి.

అధికారికంగా బిజినెస్‌

అనధికారికంగా ఎలాంటి బిజినెస్ ప్రారంభించకూడదు. అన్ని రకాలుగా ఆలోచించిన తరువాత ముందడుగు వేయండి. ఫైనల్‌గా అధికారికంగా నిర్వహించడానికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా పరిమిత బాధ్యత కూడిన పార్టనర్‌షిప్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారానికి కనీస బాధ్యత వహించడం ముఖ్యం. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే ముఖ్యంగా ట్యాక్స్ విషయాలు తెలుసుకొని ఉండాలి. మరోపక్క MSME స్కీమ్ నుంచి భవిష్యత్తు ప్రయోజనాల కోసం సరైన ఎంటిటీ క్రియేట్ చేడయం ఉత్తమం. మీరు దీన్ని ఎంత త్వరగా చేస్తే, అది మీ వ్యాపారానికి అంత మంచి చేస్తుంది.

లెర్నింగ్ కీలకం

బెస్ట్ ROI (రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్) అనేది మీరు నేర్చుకోవడానికి రేసే ఖర్చు ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇది మీ వ్యాపారాన్ని బిల్డప్ చేయడంలో ఉపయోగపడే నెట్‌వర్కింగ్, అధికారిక కోర్సులు లేదా ఇంటర్న్‌షిప్స్ రూపంలో ఉండవచ్చు. బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ప్రతిదాన్ని స్వాల్ చేయడానికి ఇంటర్‌నెట్‌ సెర్చ్‌పై ఆధారపడడం కుదరకపోవచ్చు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తిపై ఖర్చు చేయడం చాలా మంచిది. సదరు వ్యక్తిన నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చేయడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసిన తరువాత ఏవైనా పొరపాట్లు జరిగితే చాలా ఇబ్బందులు, నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అటువంటి రిస్క్‌ను వీలైనంత తగ్గించడం కోసం మీరు ముందస్తుగా కోర్సులపై పెట్టుబడి పెట్టడం బెటర్.

అకౌంటింగ్ సర్వీస్ వినియోగం

వ్యాపారం ఏదైనా అకౌంట్స్ నిర్వహిస్తే ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సులభంగా గుర్తించి పరిష్కారం కనుగొనవచ్చు. సాధారణంగా బిజినెస్ చేసేవారు అకౌంటింగ్ అవసరాల కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ పై ఆధారపడుతుంటారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారు రెగ్యులర్ అప్‌డేట్స్ కోసం ఏదైనా మంచి అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెట్టండి. రిటర్న్‌లను ఫైల్ చేయడానికి మాత్రమే చార్టర్డ్ అకౌంటెంట్‌ సేవలు ఉపయోగించుకోవడం మంచిది. ఈ రోజుల్లో సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో అనేక అకౌంటింగ్, బుక్‌కీపింగ్ సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రత్యేక అకౌంట్

మీ వ్యక్తిగత ఫైనాన్స్‌లను వ్యాపారం నుంచి వేరు చేయడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ప్రత్యేక బిజినెస్‌ అకౌంట్‌ క్రియేట్ చేయండి. ఆ అకౌంట్‌లో మాత్రమే స్వీకరించదగిన వాటిని అంగీకరించండి. అలాగే వ్యాపార ఖర్చుల కోసం వ్యక్తిగత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవద్దు. బిజినెస్ అకౌంట్ అందించడానికి బ్యాంకులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్‌కార్డ్ వంటి బిజినెస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అడుగుతాయి.

First published:

Tags: Business Ideas, Investment Plans

ఉత్తమ కథలు