Business Ideas: కేవలం రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.30 వేలు తగ్గకుండా లాభం...

కొన్ని సంవత్సరాలుగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాపారానికి, డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది నగరాల్లో ఇళ్ళు మార్చేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో, కార్యాలయం లేదా సంస్థను మార్చడానికి కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అవసరం.

Krishna Adithya | news18-telugu
Updated: August 29, 2020, 1:02 AM IST
Business Ideas: కేవలం రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.30 వేలు తగ్గకుండా లాభం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చిన్న పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారాలు నష్టపోయే అవకాశం తక్కువ. అలాగే, లాభాలు మొదటి నెల నుండే లభిస్తాయి. మీరు కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే, చిన్న పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీ కోసం గొప్ప వ్యాపారం ఉంది. చిన్న స్థాయిలో ప్రారంభించి, ఈ వ్యాపారం పెద్ద లాభాలను ఆర్జించగలదు. ప్రారంభ పెట్టుబడి రూ. 50 వేలు మాత్రమే, సంపాదన కూడా నెలకు రూ. 30 వేలు లభించే చాన్స్ ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, నగరాల జనాభా పెరుగుదల నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాపారానికి, డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది నగరాల్లో ఇళ్ళు మార్చేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో, కార్యాలయం లేదా సంస్థను మార్చడానికి కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అవసరం. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ డిమాండ్ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు ముఖ్యంగా నివాసం కోసం ప్యాకర్స్ అండ్ మూవర్స్ ను ఆశ్రయిస్తున్నారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలు తాము తరలించే వస్తువులకు బీమా సదుపాయం కల్పించడంతో, ఆ సామాన్లను భద్రంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. అటువంటి పరిస్థితిలో, కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వ్యాపారం ఎలా ప్రారంభించాలి?

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు మొత్తం ప్రణాళికతో పని చేయాలి. మీరు చిన్న స్థాయిలో ప్రారంభిస్తున్నందున, ఎక్కువ మౌలిక సదుపాయాల అవసరం లేదు.

అవసరాలు ఏమిటి?
- ఈ వ్యాపారాన్ని యజమానిగానూ, లేదా భాగస్వామ్యం లేదా కంపెనీ మోడల్ గా ప్రారంభించవచ్చు.
- ముందుగా సంస్థ పేరిట పాన్ నెంబర్ అలాగే సమీప బ్యాంకులో కరెంట్ ఖాతా ఓపెన్ చేయాలి.
- రెండవ దశలో, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ట్రేడ్ మార్క్ పేరును ఎంచుకోండి.- ఆ తరువాత, డొమైన్ పేర్లను చూడటం ద్వారా మీ వెబ్‌సైట్‌ను సృష్టించండి.
- అలాగే ఆధార్ MSMEను నమోదు చేయండి.
- ఇది సర్వీస్ బేస్డ్ వ్యాపారం. అందుకే సేవా పన్ను రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే జీఎస్టీ అండర్ టాక్స్ దాఖలు చేయాలి.
- ఒక చిన్న ఆఫీసు ఓపెన్ చేయండి. అలాగే మీ కార్యాలయాన్ని మీ ఇంటిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు.
- చివరగా, మీ బిజినెస్ మొబైల్ నంబర్ ఆధారంగా జస్ట్ డయల్ వంటి డిజిటల్ వ్యాపార వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
- ఈ వెబ్‌సైట్ల ద్వారానే మీకు వ్యాపారంలో సహాయం లభిస్తుంది.

వ్యాపారం ఎలా పొందాలి?
మీరు డిజిటల్ బిజినెస్ వెబ్‌సైట్‌లో 3 నుంచి 4 వేల రూపాయలు చెల్లిస్తే అందులో నమోదు అవుతారు. ఒక కస్టమర్‌కు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు అవసరమైనప్పుడు, అతను నెట్‌లో శోధించి వెబ్ సైట్ నిర్వహకుల ద్వారా మిమ్మల్ని కలిసే చాన్స్ ఉంది. ఆ తర్వాత మీరు కస్టమర్‌తో మాట్లాడవచ్చు మీ ఒప్పందాన్ని చేసువేయవచ్చు.

ఈ విషయాలు అవసరం
పని ప్రారంభించడానికి, మీకు ప్యాకింగ్ కార్టన్లు, ప్యాకింగ్ కాగితం, టేప్, తాడు లాంటి కొన్ని ఉపకరణాలు అవసరం. ఈ పనిలో మీ అవసరానికి అనుగుణంగా వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం, మీరు ట్రాన్స్ పోర్ట్ సంస్థను సంప్రదించవచ్చు. మీ పనికి ప్రతిఫలంగా వారు మీ నుండి డబ్బు తీసుకుంటారు. నగరాన్ని బట్టి చార్జి వసూలు చేయాల్సి ఉంటుంది.

లాభం పొందండిలా..
ఉదాహరణకు, మీరు ఒక కస్టమర్ ఇంటికి సామాన్లను మూవ్ చేయడానికి 10 వేల రూపాయల ఒప్పందాన్ని తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు ట్రాన్స్ పోర్ట్ కోసం 2 వేలు, సరుకులను ప్యాక్ చేయడానికి , శ్రమ ఖర్చు సుమారు 3 వేల రూపాయలు. బీమా ఇతర ఖర్చులు సుమారు 2 వేల రూపాయలకు వస్తాయి. ఈ విధంగా, 10 వేలలో, మీరు సామానుల బదిలీ కోసం 7 వేల రూపాయలు ఖర్చు చేశారు. మిగిలిన మూడు వేల రూపాయలు మీ నికర లాభం. ఈ విధంగా, మీరు నెలలో 10 ఆర్డర్లు తీసుకుంటే మీరు సులభంగా 30 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు.
Published by: Krishna Adithya
First published: August 29, 2020, 1:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading