START YOUR OWN ONLINE BUSINESS ON FLIPKARTS SHOPSY PLATFORM AND EARN UP TO RS 30000 SS
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)
Business Idea | పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించి నెలకు రూ.30,000 వరకు సంపాదించండి.
మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెట్టుబడి లేదా? అయినా బిజినెస్ చేయొచ్చు. ఇందుకోసం మీ దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్, కాస్త టాలెంట్ ఉంటే చాలు. నెలకు రూ.30,000 వరకు సంపాదించొచ్చు. ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ప్రారంభించిన Shopsy ప్లాట్‌ఫామ్ ద్వారా ఇది సాధ్యం. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయండి అంటూ పిలుపునిస్తోంది షాప్సీ ప్లాట్‌ఫామ్. ఇది ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సంస్థ. ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించే ప్రొడక్ట్స్ షాప్సీ వెబ్సైట్, యాప్‌లో కనిపిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని కేటగిరీల్లో ఫ్లిప్‌కార్ట్ సెల్లర్స్ 15 కోట్ల ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నారు. ఈ ప్రొడక్ట్స్‌ని మీ స్నేహితులు, బంధువులకు రికమండ్ చేసి, వారి కోసం మీరు ఆర్డర్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది.
మెట్రో నగరాలు కాకుండా నాన్ మెట్రో ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని షాప్సీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. 2023 నాటికి 2.5 కోట్ల ఆన్లైన్ ఆంట్రప్రెన్యూర్లను ఆ ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఫ్లిప్‌కార్ట్. యూజర్లు ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకొని వెంటనే బిజినెస్ మొదలుపెట్టొచ్చు. షాప్సీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేయడానికి కేవలం ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆ తర్వాత అందులో కనిపించే ప్రొడక్ట్స్‌ని వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్స్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో చేయాలి. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల తరఫున మీరే ఆర్డర్ చేసి కమిషన్ పొందొచ్చు.
ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందనేది ఆ ప్రొడక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక మీ ఫ్రెండ్ కోసం ఓ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే రూ.50 కమిషన్ వస్తుంది. అదే ల్యాప్‌టాప్ లాంటి ఖరీదైన ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే రూ.5000 వరకు కమిషన్ వస్తుంది. ఇలా ప్రొడక్ట్‌ని బట్టి కమిషన్ మారుతుంది. మీరు ప్రొడక్ట్ ఓపెన్ చేయగానే కమిషన్ ఎంత అన్నది కనిపిస్తుంది. మీరు ఆర్డర్ చేసేప్పుడు ఎవరి కోసం ఆర్డర్ చేస్తున్నారో వారి అడ్రస్ ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్ ఫ్లిప్‌కార్ట్ ప్యాకేజింగ్‌తో వారి అడ్రస్‌కు వెళ్తుంది. రిటర్న్ గడువు ముగిసిన తర్వాత మీ అకౌంట్లోకి కమిషన్ వస్తుంది.
ఇలా షాప్సీ ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు నెలకు రూ.30,000 వరకు సంపాదించొచ్చు. ఓ స్మార్ట్‌ఫోన్, అందులో షాప్సీ యాప్ ఉంటే చాలు. ప్రొడక్ట్ షిప్పింగ్, కమిషన్, రిటర్న్ పాలసీ లాంటి వివరాలన్నీ షాప్సీ యాప్‌లో ఉన్నాయి. ప్రొడక్ట్ ఆర్డర్ చేసేముందే ఆ వివరాలన్నీ ఓసారి తెలుసుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.