Business: టమాటా సాస్ బిజినెస్‌తో నెలకు రూ.40,000 ఆదాయం

Tomato Sauce Business | ముద్ర లోన్ కోసం ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాపారం కోసం మీ పాన్ నెంబర్, సంబంధిత డాక్యుమెంట్లు, లీజ్ పత్రాలు, ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: July 25, 2019, 4:24 PM IST
Business: టమాటా సాస్ బిజినెస్‌తో నెలకు రూ.40,000 ఆదాయం
Business: టమాటా సాస్ బిజినెస్‌తో నెలకు రూ.40,000 ఆదాయం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తక్కువ పెట్టుబడితో ఏదైనా మంచి వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? టమాటా సాస్ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ. లాభం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ పథకమైన ముద్ర లోన్ కూడా తీసుకోవచ్చు. కేవలం రూ.2 లక్షల పెట్టుబడి చాలు. సొంతగా టమాటా సాస్ బిజినెస్ ప్రారంభించొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో టమాటా సాస్‌కు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు... ఇళ్లల్లోనూ టమాటా సాస్ వినియోగం పెరుగుతోంది. పెద్దపెద్ద బ్రాండ్లు ఎన్ని ఉన్నా... స్థానికంగా, తాజాగా టమాటా సాస్ తయారుచేసేవారికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తే స్థానికంగా మంచి బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవచ్చు. మరి టమాటా కెచప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

టమాటా సాస్ వ్యాపారానికి పెట్టుబడి సుమారు రూ.7.82 పెట్టుబడి కావాలి. ఇందులో మీరు రూ.2 లక్షలు మెషినరీ, ఎక్యుప్‌మెంట్ కోసం ఫిక్స్‌డ్ క్యాపిటల్ పెట్టాలి. వర్కింగ్ క్యాపిటల్ రూ.5.82 లక్షలు. టమాటా, రా మెటీరియల్, సిబ్బంది జీతాలు, ప్యాకింగ్, యూనిట్ మెయింటెనెన్స్ ఖర్చులన్నీ ఇందులో వస్తాయి. వార్షిక టర్నోవర్ రూ.28.80 లక్షలు అనుకుంటే ఉత్పత్తి ఖర్చు రూ.24.22 లక్షలు. లాభం రూ. 4.58 లక్షలు. అంటే నెలకు సుమారు రూ.40,000.

మీరు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి ముద్ర లోన్ తీసుకోవచ్చు. ముద్ర లోన్ కోసం ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాపారం కోసం మీ పాన్ నెంబర్, సంబంధిత డాక్యుమెంట్లు, లీజ్ పత్రాలు, ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ మీ లోన్‌ను ప్రాసెస్ చేస్తారు. వ్యాపారానికి లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేయండి... ఈ లాభాలు పొందండిTravel Insurance: టూర్ వెళ్తున్నారా? ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌తో లాభాలివే...

ATM Card: ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి
Published by: Santhosh Kumar S
First published: July 25, 2019, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading