LIC POLICY: రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షల రిటర్న్స్

పాలసీ 25 ఏళ్లు తీసుకోవాలి. ప్రీమియం 22 ఏళ్లు చెల్లించాలి. రోజూ రూ.121 లేదా నెలకు రూ.3,600 పొదుపు చేయాలి. ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ ఉన్నన్ని రోజులు అమ్మాయికి సంవత్సరానికి రూ.1 లక్ష చొప్పున డబ్బులు వస్తాయి. పాలసీ పూర్తైన తర్వాత నామినీకి రూ.27 లక్షలు వస్తాయి.

news18-telugu
Updated: January 6, 2019, 5:23 PM IST
LIC POLICY: రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షల రిటర్న్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో అమ్మాయి పెళ్లి అంటే తల్లిదండ్రులకు అదో పెద్ద భారం, బాధ్యత. పెళ్లి మాత్రమే కాదు... అమ్మాయి పుట్టిననాటి నుంచీ తల్లిదండ్రులకు ఆందోళనే. అయితే కాస్త తెలివిగా డబ్బు పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి సమయానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్‌ఐసీలో అలాంటి ఓ పాలసీ ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిల పెళ్లిళ్ల కోసమే రూపొందించిన పాలసీ అది. ఆ పాలసీ పేరు కన్యాదాన్ యోజన.

కన్యాదాన్ యోజన
ఈ పాలసీ పొందాలంటే కనీసం 30 ఏళ్ల వయస్సు ఉండాలి. కూతురి వయస్సు ఏడాది ఉండాలి. ఈ పాలసీ 25 ఏళ్ల పాటు తీసుకున్నా ప్రీమియం 22 ఏళ్లు చెల్లిస్తే చాలు. అయితే మీ అమ్మాయి వయస్సును బట్టి పాలసీ ఎన్నేళ్లు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.

ఉదాహరణ
పాలసీ 25 ఏళ్లు తీసుకోవాలి.


ప్రీమియం 22 ఏళ్లు చెల్లించాలి.
రోజూ రూ.121 లేదా నెలకు రూ.3,600 పొదుపు చేయాలి.ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
పాలసీ ఉన్నన్ని రోజులు అమ్మాయికి సంవత్సరానికి రూ.1 లక్ష చొప్పున డబ్బులు వస్తాయి.
పాలసీ పూర్తైన తర్వాత నామినీకి రూ.27 లక్షలు వస్తాయి.

సింగిల్ ఎండోమెంట్ ప్లాన్
ఇందులో ప్రీమియం ఒకేసారి చెల్లించాలి. 90 రోజుల నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్లాన్ 10 ఏళ్లు మాత్రమే. కనీసం రూ.50,000 వేలు చెల్లించాలి. గరిష్టంగా ఎంతైనా చెల్లించొచ్చు. రూ.50,000 తీసుకుంటే ప్రీమియం రూ.40,000 చెల్లిస్తే చాలు. 10 ఏళ్లకు పాలసీ పూర్తైన తర్వాత రూ.75,000 నుంచి రూ.80,000 మధ్య వస్తాయి. ఒకవేళ మధ్యలో పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి రూ.50,000 వస్తాయి.

ఇవి కూడా చదవండి:

రెండు వారాల్లో మీ ఏటీఎం, క్రెడిట్ కార్డులు పనిచేయవు

ప్రపంచంలో ఖరీదైన ఆఫీస్ స్పేస్: టాప్‌-10లో హైదరాబాద్ ఉందా?

గుడ్ న్యూస్: ఇక 48 గంటల్లో మొబైల్ నెట్‌వర్క్ మారొచ్చు

రెడ్‌‌మీ నోట్ 6 ప్రో: రూ.999 ధరకే సొంతం చేసుకోండిలా...
First published: January 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు