హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: రూ.10 వేల పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... నెలకు రూ.30 వేల ఆదాయం

Business Idea: రూ.10 వేల పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... నెలకు రూ.30 వేల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Idea | తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేవలం రూ.10 వేల పెట్టుబడితో ఇంట్లోనే చిన్న వ్యాపారం (Small Business) ప్రారంభించి నెలకు రూ.30 వేల వరకు ఆదాయం పొందొచ్చు.

ఉద్యోగంతో ఎక్కువ సంపాదించడం కష్టం అనుకుంటున్నారా? ఏదైనా వ్యాపారం ప్రారంభించే అలోచనలో ఉన్నారా? తక్కువ పెట్టుబడితో బిజినెస్ (Low Investment Business) చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అయితే వ్యాపారం ప్రారంభించి సేల్స్ చేయడం తెలిసి ఉంటే చాలు. మంచి ఆదాయం పొందొచ్చు. కొన్ని వ్యాపారాలకు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో పచ్చళ్ల వ్యాపారం (Pickle Business) కూడా ఒకటి. ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించొచ్చు. పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం లేదు. కేవలం రూ.10,000 పెట్టుబడితో కూడా ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. వ్యాపారం పుంజుకున్న తర్వాత పెట్టుబడి పెంచుకోవచ్చు.

మోదీ ప్రభుత్వ సహకారం


ఇలాంటి చిరు వ్యాపారాలు చేయాలనుకునేవారికి మోదీ ప్రభుత్వం నుంచి సహకారం కూడా లభిస్తుంది. చిన్న వ్యాపారాలకు బ్యాంకుల నుంచి లోన్ కూడా లభిస్తుంది. మొదట రూ.10,000 పెట్టుబడితో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత బ్యాంకులు, ప్రభుత్వ రుణ పథకాల సహకారంతో వ్యాపారాన్ని విస్తరించొచ్చు. ముద్ర లోన్, ఎంఎస్ఎంఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు.

Business Loan: బిజినెస్ లోన్ కావాలా? వాట్సప్‌లో మెసేజ్ చేస్తే రూ.10 లక్షల వరకు రుణాలు

ఆన్‌లైన్‌లో సేల్స్


పచ్చళ్ల వ్యాపారం చేయడానికి మంచి పచ్చళ్లు తయారు చేయడం తెలిసి ఉండాలి. ముడిసరుకు కోసం రూ.10,000 పెట్టుబడి చాలు. మంచి రుచితో పాటు ప్యాకేజింగ్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా పచ్చళ్లు అమ్ముకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పచ్చళ్లను కొనేవారు ఎక్కువ. ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పచ్చళ్లను అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు రీటైల్ మార్కెట్లు, రీటైల్ చైన్స్ ద్వారా పచ్చళ్లను అమ్మొచ్చు.

స్థలం ఎంత కావాలంటే?


పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలం అవసరం లేదు. కేవలం 900 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. అంటే సింగిల్ బెడ్ రూమ్‌ ఇంట్లో కూడా ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. పచ్చళ్లను తయారు చేయడం, ముడిసరుకును ఆరబెట్టం, పచ్చళ్లను ప్యాక్ చేయడం, స్టోర్ చేయడం లాంటివన్నీ ఈ స్థలంలోనే చేయొచ్చు. పచ్చళ్లు పాడవకుండా జాగ్రత్తపడాలి.

Business Ideas: జాబ్ చేయకుండా డబ్బు సంపాదించాలా? ఈ 8 ఐడియాలు మీకోసమే

లాభం ఎంత?


పచ్చళ్ల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.30,000 ఆదాయం కూడా పొందొచ్చు. సేల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి పెంచుకుంటే మరింత లాభం ఉంటుంది. అయితే పచ్చళ్లను తయారు చేయడం దగ్గర్నుంచి మార్కెటింగ్ వరకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి.

లైసెన్స్ అవసరం


పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. వ్యాపారానికి సంబంధించిన అనుమతులతో పాటు ఆహారపదార్థాలకు సంబంధించిన బిజినెస్ కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ కూడా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు.

First published:

Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Business plan, Mudra loan, Online business, Small business

ఉత్తమ కథలు