Bitcoin: రూ.100తో బిట్ కాయిన్ ట్రేడ్... కొనండి, అమ్మండి... అంతా మీ ఇష్టం

వీడియోలు చూసి బిట్‌కాయిన్లు పొందండి.. అదిరే ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Bitcoin: బిట్‌ కాయిన్ కొనాలని అందరికీ ఉంటుంది. అదెలాగో చాలా మందికి తెలియదు. తెలుసుకుందామన్నా... అర్థమయ్యేలా చెప్పేవారు చాలా తక్కువ. ఇప్పుడు మనం బిట్ కాయిన్లు రూ.100కే ఎలా కొనుక్కోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Bitcoin: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కి ఈ సంవత్సరం విలువ, డిమాండ్ బాగా పెరిగాయి. ఫలితంగా ఆ కాయిన్ విలువ ప్రస్తుతం రూ.28,47,384 ఉంది. మరి అంత రేటు పెట్టి కొనడం అందరి వల్లా కాదు. సంపన్నులు మాత్రమే వాటిని కొనగలరు. అలాగైతే... ఆ కాయిన్ ప్రపంచ ప్రజల కాయిన్ ఎప్పటికీ కాలేదు. అందువల్ల... సామాన్య ప్రజలు కూడా బిట్ కాయిన్లు కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నాయి. బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్‌లు. ఇవి ఎలాంటివంటే... స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడి పెట్టేందుకు గ్రో, ఐసీఐసీఐ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్, పేటీఎం మనీ వంటి వెబ్ సైట్లు ఎలాంటివో... ఈ బిట్ కాయన్ ఎక్స్‌ఛేంజ్ కూడా అలాంటిదే. ఇందులో తక్కువలో తక్కువ రూ.100 నుంచి బిట్ కాయిన్ కొనవచ్చు, అమ్మవచ్చు. పూర్తి కాయిన్ మనకు దక్కకపోవచ్చు... కానీ... మనం పెట్టుబడి పెట్టినంతవరకూ కాయిన్‌లో కొంత భాగం మన సొంతం అవుతుంది. తద్వారా కాయిన్ విలువ పెరిగితే... మన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది.

    ఎలా ప్రారంభించాలి?
    బిట్‌ కాయిన్లలో పెట్టుబడి పెట్టేందుకు చాలా ఎక్స్‌ఛేంజ్‌లు ఉన్నాయి. వాటిలో https://wazirx.com అనేది ఒకటి. ఇందులో రూ.100కే బిట్ కాయిన్ ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లాక... సైన్ అప్ (Sign Up) అవ్వాల్సి ఉంటుంది. అంటే పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్ట్స్ KYC వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్ నంబర్, ప్యాన్ కార్డ్ నంబర్, బర్త్ డే వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ పూర్తి వివరాలు వజీర్ ఎక్స్ సైట్‌కి చేరతాయి కాబట్టి... మీకు ట్రేడింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం మీరు వజీర్ ఎక్స్ సైట్‌లోని మీ అకౌంట్‌లో కొంత మొత్తం దాచుకోవాల్సి ఉంటుంది. కనీసం రూ.100 వేస్తే... ఆ రూ.100తో మీరు బిట్ కాయిన్‌పై ట్రేడింగ్ మొదలుపెట్టవచ్చు.

    bit coin
    వజీర్ ఎక్స్ లో బిట్ కాయిన్ ట్రేడ్ (image credit - wazirx)


    చిన్న పెట్టుబడి:
    మీరు కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి రోజూ... మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందో చూసుకోవచ్చు. ఐతే... ప్రతి రోజూ లాభమే వస్తుందనేందుకు గ్యారెంటీ లేదు. బిట్ కాయిన్ విలువ పెరిగితే... మీరు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత లాభం వస్తుంది. అదే బిట్ కాయిన్ విలువ తగ్గితే... మీరు పెట్టిన పెట్టుబడిలో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అందుకు సిద్ధమైతేనే... ఈ ట్రేడింగ్ చెయ్యవచ్చు. లేదంటే మానేయడమే మేలు.

    trading
    వజీర్ ఎక్స్ లో బిట్ కాయిన్ ట్రేడ్ (image credit - wazirx)


    ప్రస్తుతం డిజిటల్ కరెన్సీలు చాలా పుట్టుకొస్తున్నాయి. వాటిలో బిట్ కాయిన్ టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచంలో బిలియనీర్లు చాలా మంది బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అందువల్ల దాని ధర పెరుగుతోంది. ఫలితంగా పెట్టుబడి పెట్టిన వారికి దీర్ఘ కాలంలో లక్షలు, కోట్లలో లాభాలు వస్తున్నాయి. వచ్చే పదేళ్లలో బిట్ కాయిన్ ప్రపంచాన్ని ఏలడం ఖాయం అంటున్నారు కొందరు నిపుణులు.

    WazirX మంచిదేనా? నమ్మవచ్చా?:
    బ్లాక్ చైన్ ట్రేడింగ్ విధానంపై పట్టున్న హార్డ్ కోర్ ట్రేడర్లు... వజీర్ ఎక్స్ అనే బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్‌ని ఇండియాలో ఏర్పాటు చేశారు. బిట్ కాయిన్లపై భారతీయులంతా పెట్టుబడి పెట్టాలన్నది తమ ఆలోచనగా చెబుతున్నారు. తాము చట్టపరంగా అన్ని రూల్సూ పాటిస్తున్నట్లు తెలిపారు.

    100కు పైగా డిజిటల్ కరెన్సీలు:
    వజీర్ ఎక్స్‌లో బిట్ కాయిన్ మాత్రమే కాదు... అలాంటి 100కు పైగా డిజిటల్ కరెన్సీలను కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రేడింగ్ చెయ్యవచ్చు. ఏ కరెన్సీ లాభాల్లో ఉంది అనుకుంటే దానిపై పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కూడా స్టాక్ మార్కెట్ లాంటిదే.

    (Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    First published: