హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: పెట్టుబడి చాలా తక్కువ.. కానీ రూ.లక్ష ఆదాయం.. ఈ బెస్ట్ బిజినెస్ పై ఓ లుక్కేయండి

Business Idea: పెట్టుబడి చాలా తక్కువ.. కానీ రూ.లక్ష ఆదాయం.. ఈ బెస్ట్ బిజినెస్ పై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ఉద్యోగం కన్నా వ్యాపారం మేలు అని అనేక మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని భావిస్తే.. మీకోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారాన్ని (Own Business) ప్రారంభించుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగం (Jobs) కన్నా వ్యాపారం మేలు అని అనేక మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని భావిస్తే.. మీకోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా (Business Idea). అదే తేనెటీగల పెంపకం. ఈ వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాధించుకోవచ్చు. ఇంకా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక రాష్ట్రాలు సబ్సిడీని కూడా ఇస్తున్నాయి. ఇది గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా ప్రారంభించే అవకాశం ఉంటుంది. తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  Business Idea: రూ.10 వేలతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం.. బిజినెస్ వివరాలివే

  వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక కేంద్ర పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం యొక్క లక్ష్యం తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను పెంచడం, శిక్షణ మరియు అవగాహన కల్పించడం. నేషనల్ బీ బోర్డ్ (National Bee Board - NBB) నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించే పథకాలను కూడా ప్రారంభించింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ప్రభుత్వం 80 నుండి 85 శాతం సబ్సిడీని అందిస్తుంది.

  మీరు 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు కావాలంటే, మీరు 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒక పెట్టెలో 40 కిలోల తేనె లభిస్తే మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వరకు ఉంటుంది. అంటే మొత్తం ఖర్చు రూ.35,000 కాగా నికర లాభం రూ.1,05,000 గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిజినెస్ పై ఓ లుక్కేయండి. మరిన్ని వివరాలకు ఇప్పటికే ఈ వ్యాపారాన్ని చేస్తున్న వారిని సంప్రదించండి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Business Ideas, Investment Plans

  ఉత్తమ కథలు