మీరు ఇంట్లో కూర్చుని మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా?. అయితే మీకు గొప్ప బిజినెస్ ఐడియా గురించి చెబుతా. మీరు కేవలం 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కోట్లలో సంపాదించవచ్చు. అవును మీరు విన్నది కరెక్టే. నెలకు రూ. కోటి వరకు సంపాదించొచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అంటారా.. ఆన్లైన్ హోర్డింగ్స్ వ్యాపారం. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ హోర్డింగ్ బిజినెస్ చాలా లాభదాయకమైంది. ఖర్చూ తక్కువే. ఇంతకూ అసలు ఆ వ్యాపారం ఏంటి.. ఎలా ఉంటుందంటారా? తెలుసుకుందాం.. ఏం లేదండీ.. కేవలం ఒకే ఒక వెబ్‌సైట్‌తో పని మొదలెట్టొచ్చు. ఈ రోజుల్లో చాలామందికి తమ కంపెనీలను, బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి దారి చూపించడమే ఈ హోర్డింగ్ బిజినెస్ ఐడియా. మీ వెబ్సైట్లో సిటీలోని ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు పెట్టడానికి పక్కా స్థలాన్ని గుర్తించాలి. మీ వెబ్సైట్లో పెట్టేయ్యాలి. కస్టమర్ మీ వెబ్సైట్లో లాగిన్ అయినపుడు ఆ స్థలాన్ని బుక్ చేసుకుంటారు. అపుడు ఆ స్థలం వారికి మీరు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. వారి నుంచి అనుమతి వచ్చాక కస్టమర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయొచ్చు. అయితే ఇంతకు దీనిలో ఎవరైనా బాగా సంపాదించారా అంటే... ఒకరున్నారండోయ్.. కేవలం 50వేల పెట్టుబడి పెట్టి అక్షరాలా ఏడాదికి రూ.20 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఎవరంటారా? అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ స్టార్టప్ కంపెనీ గోహోర్డింగ్స్.కామ్ (gohoardings.com) వ్యవస్థాపకురాలు దీప్తి అవస్థీ శర్మ. ఇంతకీ ఆమె ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందా..
దీప్తి అవస్థి శర్మ 2016 సంవత్సరంలో ఆన్లైన్ హోర్డింగ్‌ల వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు. పెద్ద బిజినెస్ చేయడానికి అంత పెద్ద మొత్తంలో డబ్బు లేనందున, దీప్తి కేవలం 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆన్లైన్ హోర్డింగ్ ప్రారంభించింది. మరుసటి సంవత్సరం నుంచి 12 కోట్లు సంపాదించడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తర్వాత దీప్తి కంపెనీ టర్నోవర్ రూ.20 కోట్లు దాటింది.
దీప్తి మాట్లాడుతూ.. నేను 2016 లో డిజిటల్ హోర్డింగ్‌ల వ్యాపారాన్ని చాలా తక్కువ మొత్తంలో 50 వేలతో ప్రారంభించాను. ఈ ఆలోచన విజయవంతమైంది. కస్టమర్ మా కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వారికి కావల్సిన ఏరియా స్థలాన్ని ఎంపిక చేసుకున్నాక, గోహోర్డింగ్ వెబ్సైట్ సదరు కంపెనీకి రిక్వెస్ట్ పెడుతుంది. వారి నుంచి అనుమతి వచ్చాక కస్టమర్‌కు తెలియజేస్తాం. కస్టమర్‌కు ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తాం. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి హోర్డింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఓ నెల వరకు ఆ హోర్డింగ్ ఏర్పాటుచేసి, డబ్బులు చెల్లిస్తారు” అని తెలిపారు. దీప్తి ప్రయాణం చూశారు కదా... ఇంకే బిజినెస్ మొదలుపెట్టండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, BUSINESS NEWS, Earn money, Earn money online, Online business