Home /News /business /

START FLY ASH BRICKS MANUFACTURING BUSINESS WITH 2 LAKH INVESTMENT AND EARN UPTO 1 LAKH PER MONTH HERE BUSINESS IDEA DETAILS NS

Business Idea: కేవలం రూ.2 లక్షల పెట్టుబడి.. నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం.. ఈ బెస్ట్ బిజినెస్ ఐడియా మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సొంతంగా బిజినెస్(Own Business) చేయాలనుకుంటున్నారా? అయితే.. ఫ్లై యాష్ బ్రిక్స్(Fly Ash Bricks) బిజినెస్ మీకు ఓ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. సొంతంగా స్థలం ఉంటే ఈ బిజినెస్(Business) ను కేవలం రూ. 2 లక్షలతో ప్రారంభించవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada
    కరోనా(Corona) నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు(Jobs) కోల్పోయారు. దీంతో అలాంటి వారంతా సొంతంగా బిజినెస్(Business) చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఫ్లై యాష్ బ్రిక్స్(Fly Ash Bricks) బిజినెస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సొంత భూమి ఉండి, తక్కువ పెట్టుబడితో మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం 100 గజాల స్థలం, కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి(Investment) పెట్టాల్సి ఉంటుంది. దీనితో మీరు ప్రతి నెలా 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. వేగవంతమైన పట్టణీకరణ యుగంలో బిల్డర్లు ఫ్లై యాష్‌తో చేసిన ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ బిజినెస్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

    ప్రతి నెలా 3 వేల ఇటుకలు తయారు చేసుకోవచ్చు..
    ఈ ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద, సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం, మీరు ఎక్కువ పెట్టుబడిని యంత్రాలపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలంలో ఉంచొచ్చు. ఈ యంత్రం ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. ఈ యంత్రం ద్వారా, మీరు ఇటుక ఉత్పత్తి కోసం 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరం. దీంతో రోజుకు దాదాపు 3 వేల ఇటుకలను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో ఇటుక ధర రూ. 5 నుంచి రూ. 10 వరకు ఉంటుంది.
    Billionaire: పదిహేనేళ్లలో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?.. అయితే, ఈ రూల్ పాటించండి

    ఆటోమేటిక్ యంత్రాలతో ఎక్కువ ఉత్పత్తి..
    ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మెషీన్ల ఉపయోగిస్తే ఎక్కువ ఉత్పత్తితో పాటు, ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ ఆటోమేటిక్ మిషన్ ధర రూ.10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే జరుగుతాయి. ఆటోమేటిక్ మెషీన్ ద్వారా గంటలో వెయ్యి ఇటుకలను తయారు చేయవచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలలో మూడు నుండి నాలుగు లక్షల ఇటుకలను తయారు చేయవచ్చు.
    Business Idea: నష్టాలు ఉండని ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఐడియా... మీరూ స్టార్ట్ చేయండి ఇలా


    రుణం కూడా తీసుకోవచ్చు..

    బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందు కోసం ముందుగా బ్యాంకులను సంప్రదించి రుణాలను పొందొచ్చు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి కూడా రుణాలను తీసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Business Ideas, Investment Plans

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు