సీనియర్ సిటిజన్లకు అంటే 50 ఏళ్లు దాటినవారికి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు (Health Insurance Policy) తీసుకోవాలంటే కాస్త కష్టం. ప్రీమియం ఎక్కువగా ఉండటం, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటం లాంటి చిక్కులు ఉంటాయి. 50 ఏళ్లు పైబడ్డవారిని దృష్టిలో పెట్టుకొని స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్స్యూరెన్స్ (Star Health Premier Insurance) ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన కస్టమర్లు అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆస్పత్రిపాలైతే వారి ఆస్పత్రి ఖర్చుల్ని కవర్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది. స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్స్యూరెన్స్ పాలసీలో హోమ్ కేర్ ట్రీట్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో సమ్ ఇన్స్యూర్డ్‌లో 10 శాతం గరిష్టంగా రూ.5,00,000 వరకు కవర్ చేస్తుంది.
స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్స్యూరెన్స్ పాలసీలో ఇన్‌పేషెంట్ ఆస్పత్రి ఖర్చులు, ఆయుష్ ట్రీట్మెంట్‌లో డే కేర్ ట్రీట్మెంట్స్ లాంటివి కవర్ అవుతాయి. గ్లోవ్స్ లాంటి నాన్ మెడికల్ ఐటెమ్స్, ఫుడ్ ఛార్జీలు లాంటివి కూడా ఇందులో కవర్ అవుతాయి. ఆధునిక చికిత్సలకు సంబంధించి 50 శాతం కవరేజీ లభిస్తుంది.
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16 లక్షల రిటర్న్స్
స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఇండివిజ్యువల్, ఫ్లోటర్ బేసిస్‌లో లభిస్తుంది. 50 ఏళ్లు దాటినవారు ఎవరైనా తీసుకోవచ్చు. ముందుగా ఏవైనా వ్యాధులు ఉన్నా, చికిత్స తీసుకుంటున్నా, ఏవైనా వైకల్యాలు ఉన్నా ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేదు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పద్ధతిలో పాలసీ తీసుకోవచ్చు. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఈ పాలసీ తీసుకోవచ్చు.
మిడ్‌టర్మ్ ఇన్‌క్లూజన్స్, ఔట్ పేషెంట్ మెడికల్ ఖర్చులు, హెల్త్ చెకప్ బెనిఫిట్, ఆల్ డే కేర్ ప్రొసీజర్స్, రోడ్ అండ్ అంబులెన్స్ ఎక్స్‌పెన్సెస్, ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్, ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్, బేరియాట్రిక్ సర్జరీ, క్యుములేటీవ్ బోనస్, రీబ్యాబిలిటేషన్ అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఖర్చులు లాంటివి ఇందులో కవర్ అవుతాయి.
IRCTC BoB Credit Card: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... మీకోసం కొత్త క్రెడిట్ కార్డ్
స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్స్యూరెన్స్ పాలసీ రూ.1 కోటి వరకు తీసుకోవచ్చు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.1 కోటి చొప్పున పాలసీ తీసుకోవచ్చు. ఔట్ పేషెంట్ మెడికల్ ఖర్చులు మొదటి రోజు నుంచి కవర్ అవుతాయి. బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తం ఉపయోగించుకున్నా, పాక్షికంగా ఉపయోగించుకున్నా ఆటోమెటిక్ రీస్టోరేషన్ ద్వారా 100 శాతం రీస్టోర్ అవుతుంది.
ఈ పాలసీని రెండేళ్లకు ఒకేసారి తీసుకుంటే రెండో ఏడాది ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్, మూడేళ్లకు ఒకేసారి తీసుకుంటే రెండో, మూడో ప్రీమియంలో 11.25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance