హోమ్ /వార్తలు /బిజినెస్ /

StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

StandUp India Scheme | వ్యాపారం చేయాలనుకునే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, మహిళలకు కేంద్ర ప్రభుత్వం స్టాండ్‌అప్ ఇండియా (StandUp India) స్కీమ్ ద్వారా రుణాలు అందిస్తోంది. కనీసం రూ.10 లక్షల నుంచి లోన్ తీసుకోవచ్చు.

StandUp India Scheme | వ్యాపారం చేయాలనుకునే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, మహిళలకు కేంద్ర ప్రభుత్వం స్టాండ్‌అప్ ఇండియా (StandUp India) స్కీమ్ ద్వారా రుణాలు అందిస్తోంది. కనీసం రూ.10 లక్షల నుంచి లోన్ తీసుకోవచ్చు.

StandUp India Scheme | వ్యాపారం చేయాలనుకునే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, మహిళలకు కేంద్ర ప్రభుత్వం స్టాండ్‌అప్ ఇండియా (StandUp India) స్కీమ్ ద్వారా రుణాలు అందిస్తోంది. కనీసం రూ.10 లక్షల నుంచి లోన్ తీసుకోవచ్చు.

వ్యాపారాలు నిర్వహించేందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారితో పాటు, మహిళలకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టాండ్‌అప్ ఇండియా (StandUp India) పథకానికి ఆరేళ్లు పూర్తైంది. 2016లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 21 వరకు 1,33,995 మంది ఈ రుణాలు తీసుకున్నారని, మొత్తం రూ.30,160 కోట్ల రుణాలు మంజూరు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1,33,000 మందికి కొత్తగా ఉద్యోగాలు సృష్టించామని, వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచామని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా లక్ష మందికి పైగా మహిళా ప్రమోటర్లు లాభపడ్డారని తెలిపారు.

భారతదేశంలో పెరుగుతున్న ఆంట్రప్రెన్యూర్స్ సంపద సృష్టికర్తలుగా మాత్రమే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తమ పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని నడిపించడంలో వారికి ఉన్న సామర్థ్యాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఆంట్రప్రెన్యూర్స్‌లో వెనుకబడిన వర్గాల వారికి కవరేజీని అందించడం లక్ష్యంగా చేసుకున్నందున, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ప్రగతి సాధిస్తున్నాం.

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ 2016 ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి అట్టడుగు స్థాయిలో ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు చెందినవారు, మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ బ్యాంకులో కనీసం ఒక్కరికైనా ఈ పథకం కింద లోన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తయారీ రంగం, సేవా రంగాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేసేవారు ఈ రుణాలు తీసుకోవచ్చు.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు

స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ద్వారా 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా రుణాలు తీసుకోవచ్చు. వ్యాపారంలో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలవారు, మహిళలకు కనీసం 51 శాతం షేర్‌హోల్డింగ్ ఉండాలి. ఏ బ్యాంకులో గతంలో రుణాలు తీసుకొని డిఫాల్ట్ అయినవారు కాకూడదు. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) స్టాండప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా అప్లై చేయొచ్చు. లేదా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు లోన్ దరఖాస్తు పంపొచ్చు. ఆన్‌లైన్‌లో లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

PM Kisan 11th Installment: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... అప్పట్లోగా ఈ పని పూర్తి చేయండి

ముందుగా https://www.standupmitra.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో Apply Here పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

New Entrepreneur, Existing Entrepreneur, Self Employed Professional ఆప్షన్స్‌లో మీకు సూటయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి.

పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి.

ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

వ్యాపారం వివరాలు, లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి రుణానికి దరఖాస్తు చేయాలి.

First published:

Tags: Bank loan, Business Loan, Personal Finance

ఉత్తమ కథలు