Union Budget 2019| స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో వేతన జీవులపై భారం... బడ్జెట్ పై ఆశలు

ఫైనాన్షియల్ యాక్ట్ 2018 ద్వారా స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.40 వేలుగా నిర్ధారించారు. అంటే పన్ను చెల్లింపుదారు తన యాన్యువల్ వేతనం నుంచి ఈ మొత్తాన్ని డిడక్షన్ గా చూపించవచ్చు. అయితే దీనికి ఎలాంటి ప్రత్యేకమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. అయితే అయితే ఈ మినహాయింపులో ఇప్పటికే ట్రావెల్‌ అలవెన్స్‌పై రూ.19,600, మెడికల్‌ అలవెన్స్‌పై రూ.15 వేల వరకు మినహాయింపు ఉంది. అంటే కొత్తగా ఇచ్చిన మినహాయింపు రూ.5,800 మాత్రమే అదనపు మినహాయింపుగా లభించింది.

news18-telugu
Updated: June 29, 2019, 11:16 PM IST
Union Budget 2019| స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో వేతన జీవులపై భారం... బడ్జెట్ పై ఆశలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 29, 2019, 11:16 PM IST
ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త నిబంధనలు వేతన జీవులకు కొరకరాని కొయ్యగా మారాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఇతర కన్సల్టెంట్ల వారి నెలవారీ ఆదాయంలో తమ ఖర్చుల్లో మినహాయింపు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ వేతన జీవులకు మాత్రం కచ్చితంగా వేతనం పైనే ఈ పన్ను విధింపు జరుగుతుంది. దీంతో చేతికి వచ్చే వేతనంపై భారం పడుతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్ట్ 2018 ద్వారా స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.40 వేలుగా నిర్ధారించారు. అంటే పన్ను చెల్లింపుదారు తన యాన్యువల్ వేతనం నుంచి ఈ మొత్తాన్ని డిడక్షన్ గా చూపించవచ్చు. అయితే దీనికి ఎలాంటి ప్రత్యేకమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. అయితే అయితే ఈ మినహాయింపులో ఇప్పటికే ట్రావెల్‌ అలవెన్స్‌పై రూ.19,600, మెడికల్‌ అలవెన్స్‌పై రూ.15 వేల వరకు మినహాయింపు ఉంది. అంటే కొత్తగా ఇచ్చిన మినహాయింపు రూ.5,800 మాత్రమే అదనపు మినహాయింపుగా లభించింది. అయితే స్డాండర్డ్ డిడక్షన్ 2019లో రూ.50 వేల వరకూ పెంచారు. అయితే ఈ మొత్తం ప్రస్తుత బడ్జెట్ లో మరింత పెంచాల్సిన అసవరం ఉందని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే వేతన జీవుల కన్నా కన్సల్టెంట్లకు ( డాక్టర్, ఇంజనీర్, లాయర్... ఇతరమైన వృత్తులు) సంవత్సరానికి రూ.50 లక్షల లోపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న వైద్యులు, న్యాయవాదుల్లాంటి వృత్తి నిపుణులకు పన్నులను సరళతరం చేశారు. ఉదాహరణకు వృత్తినిపుణులకు, వేతన జీవులకు సాలీనా వేతనం రూ.30 లక్షలుగా అనుకున్నట్లయితే వేతన జీవులకు ప్రొఫెషన్ టాక్స్, సాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 40 వేలు, అదనంగా మినహాయింపులు చూపగా పన్ను చెల్లించే ఆదాయం 27,82,600 తేలుతుంది. అయితే మిగిలి మొత్తంపై ఇన్ కంటాక్స్ సెస్ కలిపి ప్రస్తుత స్లాబ్ రేట్ల ప్రకారం 6,73,171 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అదే కన్సెల్టెంట్లకు మాత్రం వచ్చిన రూ.30 లక్షల ఆదాయంలో కేవలం 50 శాతం గ్రాస్ పైనే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టాండర్డ్ డిడక్షన్స్ ఉండవని అర్థం అలాగే 80సీ కింద రూ. లక్షన్నర మినహాయింపు చేసుకునే అవకాశం ఉండగా, 80డీ హెల్త్ ఇన్సురెన్స్ కింద రూ.25 వేల వరకూ మినహాయింపు ఉంది. అంటే చివరకు పన్ను చెల్లించే ఆదాయం రూ.13,25,000గా తేలగా దానిపై ఇన్ కం ట్యాక్స్ అలాగే సెస్ కలుపుకొని దాదాపు రూ.2,18,400గా చెల్లించాల్సి ఉంది. అంటే వృత్తి నిపుణుల కన్నా వేతన జీవులు దాదాపు 200 శాతం అధికంగా పన్ను చెల్లిస్తున్నారు. అంటే దాదాపు రూ.4.55 లక్షలు పన్ను వేతన జీవులు అధికంగా చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్ లో వేతనాన్ని బట్టి స్టాండర్డ్ డిడక్షన్ పై కేంద్రం మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని వేతన జీవులు ఆశిస్తున్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...