Business Ideas: బిజినెస్ ఐడియా ఉందా...అయితే 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేని లోన్‌ మీకోసం...

Business Ideas: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా నిరుద్యోగులు ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా లోన్‌ పొందే అవకాశం కల్పించింది.

Krishna Adithya | news18-telugu
Updated: February 17, 2020, 6:14 PM IST
Business Ideas: బిజినెస్ ఐడియా ఉందా...అయితే 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేని లోన్‌ మీకోసం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా... సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే అందుకు పెట్టుబడి ఎలా పొందాలి అనేది ప్రతీ ఒక్కరు ఆలోచిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టాండప్ ఇండియా (Standup India) స్కీమ్ ద్వారా నిరుద్యోగులు ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా లోన్‌ పొందే అవకాశం కల్పించింది. పేదల అభివృద్ధి కోసం, యువ‌త‌కు, మ‌హిళ‌లకు, చిరు వ్యాపార‌వేత్త‌ల‌కు, ఔత్సాహికుల‌కు.. సంక్షేమ ప‌థ‌కాల‌ను మోదీ అందుబాటులోకి తెచ్చారు. అందులో ప్రధానమైనది స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల మరియు తెగలకు చెందిన మహిళలకు అందిస్తారు. ఈ పథకం ఆర్థిక సేవల శాఖ (DFS), ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతోంది. ఒక బ్యాంకు శాఖ కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) మహిళకు స్టాండ్ అప్ ఇండియా(Standup India) పథకం కింద రూ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రుణాన్ని అందించవచ్చు.  ఒకవేళ మీరు ఒక సంస్థ ద్వారా రుణం అప్లై చేసుకున్నట్లయితే అందులో కనీసం 51 శాతం వాటా  ఒక SC / ST లేదా మహిళ పారిశ్రామికవేత్త కలిగి ఉండాలి. అప్పుడు మీకు రుణం సులభంగా లభిస్తుంది.


రుణం పొందేందుకు అర్హత...

- ఎస్సీ/ఎస్టీ మహిళ అయిఉండటంతో పాటు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
- పథకం కింద ఆకుపచ్చ పథకాలకు (గ్రీన్ ప్రాజెక్ట్) మాత్రమే రుణాలు అందుబాటులో ఉంటాయి.


- నూతన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రుణం లభిస్తుంది.
- భాగస్వామ్య సంస్థల విషయంలో, 51% వాటా మరియు నియంత్రణలు ఎస్సీ/ఎస్టీ మరియు/లేదా మహిళా పారిశ్రామికవేత్త నిర్వహించాలి.- రుణగ్రహీత ఏ బ్యాంకు/ఆర్ధిక సంస్థకు బకాయిలు (డిఫాల్ట్) ఉండకూడదు.

రుణం వివరాలు
- రుణ స్వభావం - సంయుక్త (కాంపోజిట్) రుణం (ఈ విడత రుణం మరియు మూలధనం కలుపుకొని) 10 లక్షల నుండి రూ.1 కోటి దాకా ఉంటుంది.
- ఎస్సీ/ఎస్టీ/మహిళలు పారిశ్రామికవేత్తలతో తయారీ, వ్యాపార లేదా సేవల రంగంలో ఒక నూతన ప్రయత్నాల (వెంచర్) ఏర్పాటు.
- మీ ప్రాజెక్టు రిపోర్టును బట్టే రుణం లభిస్తుంది. మీ కంపెనీ తయారు చేసే ప్రాడెక్టు, లేదా సేవల గురించి స్పష్టంగా తెలియచేయాలి.
- ప్రాజెక్టు రిపోర్టులో 75 శాతం రుణం లభిస్తుంది. ఉదాహరణకు మీ ప్రాజెక్టు ఖర్చు రూ.1 కోటి అయితే అందులో రూ.75 లక్షల రుణం లభిస్తుంది. అంతేకాదు మీ ప్రాజెక్టు ఖర్చులో మీరు 10 శాతం భరించాల్సి ఉంటుంది.
- రుణాలు తీసుకునే పారిశ్రామిక వేత్తలకు రూపే కార్డును అందిస్తారు. దీంతో ఒకేసారి రుణ మొత్తాన్ని తీసుకోకుండా వర్కింగ్ కేపిటల్ కింద అవసరమైనప్పుడల్లా సొమ్ము విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
- మీరు పొందే రుణాన్ని రెండు రకాలు ఇస్తారు..టర్మ్ లోన్, వర్కింగ్ క్యాపిటల్ గా ఇస్తారు.
- వడ్డీ రేటు -వడ్డీ రేటు బేస్ రేటు (MCLR) +3% + టెనార్ ప్రీమియం మించకుండా ఉంటుంది. అంటే సుమారు 11 నుంచి 13 శాతం వడ్డీ ఉంటుంది.
- హామీ - ప్రాధమిక హామీతో పాటు, రుణానికి స్టాండ్-అప్ ఇండియా రుణాల (CGFSIL) క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం హామీ ఉండాలి.
- చెల్లింపు - 18 నెలల గరిష్ట విరామం (మారటోరియం) కాలంతో 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి.

రుణాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి
ఈ పథకాన్ని, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల అన్ని శాఖలను కలుపుకొని, మూడూ సంభావ్య విధాలుగా ఉపయోగించవచ్చు. నేరుగా శాఖ వద్ద లేదా or స్టాండ్-అప్ ఇండియా పోర్టల్ (www.standupmitra.in) ద్వారా లేదా లీడ్ జిల్లా మేనేజర్ ద్వారా (LDM) పొందాలి.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు