• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SSC TUATARA IS NOW THE WORLDS FASTEST PRODUCTION CAR RECORDS 535 KMPH TOP SPEED SS GH

SSC Tuatara Car: అత్యంత వేగవంతమైన కారు ఇదే... దీని స్పీడ్ ఎంతో తెలిస్తే షాకే

SSC Tuatara Car: అత్యంత వేగవంతమైన కారు ఇదే... దీని స్పీడ్ ఎంతో తెలిస్తే షాకే

SSC Tuatara Car: అత్యంత వేగవంతమైన కారు ఇదే... దీని స్పీడ్ ఎంతో తెలిస్తే షాకే (Image source: SSC)

SSC Tuatara Car | ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా SSC Tuatara రికార్డు సృష్టించింది. ఈ కారు స్పీడ్ ఎంతో తెలుసుకోండి.

  • Share this:
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారుగా రికార్డు సాధించింది SSC Tuatara సూపర్ కార్. దీన్ని అమెరికాకు చెందిన SSC North America ఆటోమొబైల్ సంస్థ అభివృద్ధి చేసింది. తాజాగా ఈ సూపర్ కారు 331.15 mph (గంటకు 532.93 కిలోమీటర్లు) వేగాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. 2017 లో Koenigsegg Agera RS అనే కారు 277.87 mph (గంటకు 447.19) వేగాన్ని అందుకొని, అత్యంత వేగవంతమైన కారుగా రికార్డు నెలకొల్పింది. ఈ పాత రికార్డును Tuatara బ్రేక్ చేసింది. అక్టోబర్ 10న లాస్ వెగాస్‌లోని నెవాడాలో 11.26 కిలోమీటర్ల పొడవైన ట్రాక్పై SSC Tuataraను పరీక్షించారు. గతంలో ఇక్కడే వివిధ కార్ల వేగాన్ని పరీక్షించారు. ఈ తాజా సూపర్ కారు కొన్ని సెకన్లకే 301.07 మైళ్ల (484.53 kmph) వేగాన్ని అందుకొని దూసుకెళ్లింది. అనంతరం 331.15 మైళ్ల (532.93 kmph) వేగంతో తిరిగి వచ్చింది. దీంతో సగటు వేగం 316.11 మైళ్లు (508.73 kmph)గా నమోదైంది. ఈ వేగం పాత రికార్డుల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

అన్ని రికార్డులూ బ్రేక్


స్టాక్ టైర్లు, నాన్‌ రేస్‌ ఫ్యూయెల్‌తో పరుగెత్తిన ఈ కారు ఇతర రికార్డులను కూడా సృష్టించింది. ఇది 313.12(503.92 kmph) మైళ్ల వేగంతో “ఫాస్టెస్ట్‌ ఫ్లయింగ్ మైల్ ఆన్ పబ్లిక్ రోడ్” రికార్డును, 321.35(517.16 kmph) మైళ్ల వేగంతో “ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ కిలోమీటర్ ఆన్ పబ్లిక్ రోడ్” రికార్డులను తన పేరుమీదకు మార్చుకుంది.

ఉపగ్రహాలతో పర్యవేక్షణ


ఈ పరుగును పరీక్షించడానికి ప్రత్యేక జీపీఎస్ మెజర్మెంట్ డివైజ్‌ను, పదిహేను ఉపగ్రహాలను ఉపయోగించారు. దీంతో పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఇద్దరు వ్యక్తులను సర్టిఫైడ్ విట్‌నెస్‌గా నియమించారు. క్రాస్‌విండ్స్ (ఎదురు గాలులు) తక్కువగా ఉంటే SSC Tuatara మరింత వేగంగా దూసుకెళ్లగలదని ప్రొఫెషనల్ రేసర్ ఒలివర్ వెబ్ చెబుతున్నారు.

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

సూపర్‌ ఇంజిన్‌తో దూసుకుపోతుంది


తమ సంస్థకు చెందిన టౌటారా కారు తాజా రికార్డు సాధించడంపై SSC సంస్థ CEO జెరోడ్ షెల్బీ హర్షం వ్యక్తం చేశారు. ‘మా సంస్థ నుంచే గతంలో వచ్చిన Ultimate Aero కారు పేరుతో ఉన్న రికార్డులను 2010 లో Bugatti Veyron సూపర్ స్పోర్ట్ అధిగమించింది. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. టౌటారా మోడల్ అల్టిమేట్ ఏరో కంటే మెరుగ్గా ఉంటుందని షెల్బీ చెప్పారు. దీని ధర 1.6 మిలియన్ డాలర్లు. ట్విన్ టర్బో 5.9 లీటర్ల V8 ఇంజిన్‌తో ఈ సూపర్ కారును రూపొందించారు. ఇది అత్యధికంగా 1726 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ప్రస్తుతం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: