Home /News /business /

SRI LANKA STOCK MARKET SHUTS AFTER FALL PVN

Sri Lanka Stock Market : కుప్పకూలిన శ్రీలంక స్టాక్ మార్కెట్లు..ట్రేడింగ్ నిలిపివేత

శ్రీలంకలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్

శ్రీలంకలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Sri Lanka Crisis : తమ మాతృభూమిని కాపాడాలని, వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస విజ్ణప్తి చేశారు. సోమవారం భారత్‌కు చెందిన ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
Sri Lanka Stock Market Fall : ఇప్పటికే ఆహార, చమురు, విద్యుత్‌, విదేశీ ద్రవ్య లభ్యత వంటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న శ్రీలంకకి తాజాగా మరో షాక్‌ తగిలింది. ఇవాళ కొలంబో స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే... 5.9 శాతం మేర కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ పతనమైంది. స్టాక్​మార్కెట్లు కుప్పకూలడం వల్ల ప్రధాన కంపెనీలు షేర్లను భారీగా నష్టపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మార్కెట్‌ మరింతగా క్రాష్‌ అవ్వకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే..కొలంబో మార్కెట్‌ ను మూసేస్తున్నట్టు ప్రకటించారు. అరగంట పాటు ట్రేడింగ్‌ ను నిలిపివేసినట్లు కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది. మరో వైపు లంక పార్లమెంట్‌ కేబినెట్‌ మంత్రులు 26 మంది రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. రాజీనామా చేసిన వారిలో ప్రధాని మహింద్ర రాజపక్సే తనయుడు నమల్‌ రాజపక్సే కూడా ఉన్నారు.

ఇక,ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు తమ మంత్రిత్వ శాఖలో చేరాలని కోరారు. తద్వారా సంక్షోభానికి పరిష్కరానికి దిశగా అడుగులు వేద్దామని అన్నారు. కాగా, తన సోదరుడు, దేశ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సను పదవిలో నుంచి తొలగించారు అధ్యక్షుడు గొటబయా. సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.

తమ మాతృభూమిని కాపాడాలని, వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస విజ్ణప్తి చేశారు. సోమవారం భారత్‌కు చెందిన ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "దయచేసి శ్రీలంకకు వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించండి. తోడ్పాటును మరింత పొడగించండి. ఇది మా మాతృభూమి. మా మాతృభూమిని మేము కాపాడుకోవాలి. అందుకు మీ సహకారం చాలా కావాలి" అని ప్రేమదాస అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Srilanka, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు