• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • SPUTNIK V VACCINE SECOND BATCH OF RUSSIA COVID 19 VACCINE SPUTNIK V ARRIVES IN HYDERABAD BY FLIGHT LATEST DETAILS NK

Sputnik V vaccine: రష్యా నుంచి హైదరాబాద్ వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ సెకండ్ బ్యాచ్

Sputnik V vaccine: రష్యా నుంచి హైదరాబాద్ వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ సెకండ్ బ్యాచ్

రష్యా నుంచి హైదరాబాద్ వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ (image credit - twitter - ANI)

Sputnik V vaccine: ఉన్న రెండు వ్యాక్సిన్ల ఉత్పత్తి సరిపోకపోవడంతో... ఇప్పుడు దేశ ప్రజలు స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. సెకండ్ బ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.

  • Share this:
    Sputnik V vaccine: రష్యాలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి... రెండో బ్యాచ్ తెచ్చిన విమానం... హైదరాబాద్‌లో ఆదివారం ల్యాండ్ అయ్యింది. ఇండియాలోని రష్యా రాయబారి నికొలే కుదాషెవ్... ఇది రెండు దేశాల మధ్యా ప్రాధాన్యపూరిత వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్‌ను అంతం చేసే కార్యక్రమంలో ఇదో ప్రభావవంతమైన మోడల్ అన్నారాయన. "కరోనాకి విరుగుడుగా రష్యా-ఇండియా జాయింట్ విమానం రావడంపై ఎంతో సంతోషిస్తున్నాం. ఇది ఈ రోజుల్లో మా ద్వైపాక్షిక సహకారంలో అత్యంత కీలకమైన అంశం. దీనికి మేం కట్టుబడి ఉంటాం. ఇదే విధంగా ముందుకు సాగుతాం" అని నికొలే అన్నారు.

    ఇండియాలో ల్యాండ్ అయిన తొలి విదేశీ కరోనా విరుగుడు వ్యాక్సిన్ ఏదంటే... స్పుత్నిక్ వి అని చెప్పుకోవచ్చు. శుక్రవారం ఈ వ్యాక్సిన్ తొలి డోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ వారు వేయించుకున్నారు. మే 1న తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు వచ్చాయి. రెండో బ్యాచ్ ఇవాళ వచ్చింది.


    భారత్‌కి మొదటి నుంచి రష్యా మిత్ర దేశంగా ఉంటోంది. ఐతే... బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులుగా ఉన్నప్పుడు రష్యాతో సంబంధాలపై భారత్ కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఈ వ్యాక్సిన్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి.


    ప్రపంచంలో ముందుగా తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి నే. 2020 మధ్య నుంచి రష్యా ఈ వ్యాక్సిన్ వాడుతోంది. ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త వేరియంట్లకు కూడా బాగా పనిచేస్తోందని రష్యా స్పెషలిస్టులు ప్రకటించారు. రష్యా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకి ఏడాదికి 8.5 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకా చాలా దేశాలకు దీన్ని ఇస్తోంది. ఇండియాలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్... జులై నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టనుంది. ఈ లోగా రష్యా నుంచి వ్యాక్సిన్లు రానున్నాయి.

    ఇది కూడా చదవండి: Business Ideas: రూ.50,000 పెట్టుబడితో చిన్న వ్యాపారం... నెల నెలా చక్కటి ఆదాయం

    రష్యా త్వరలో స్పుత్నిక్ లైట్ అనే వ్యాక్సిన్‌ను ఇండియాకి ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి వేసుకుంటే చాలు. స్పుత్నిక్ వి ని ఎమర్జెన్సీగా వాడేందుకు ఏప్రిల్ 12న అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ను త్వరలో ఇండియాలోనే అత్యధికంగా ఉత్పత్తి చేయనున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: