news18-telugu
Updated: March 12, 2020, 12:46 PM IST
అయితే అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తరువాత దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన కేంద్రం... అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా మొదలుపెట్టాలని చాలారోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది.
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. స్పైస్‌జెట్ స్ప్రింగ్ సీజన్ సేల్‌లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.987 మాత్రమే. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.3,699. ఈ సేల్ 2020 మార్చి 12న ప్రారంభమైంది. ఆఫర్ 2020 మార్చి 15న ముగుస్తుంది. ఈ ఆఫర్ ధరకే 2021 ఫిబ్రవరి 28 వరకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ వేసవి సెలవులతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా ఏవైనా ప్రయాణాలు ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. స్పైస్‌జెట్ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు క్యాన్సిల్ చేస్తే నార్మల్ క్యాన్సలేషన్ ఛార్జీలతో రీఫండ్ పొందొచ్చని స్పైస్‌జెట్ చెబుతోంది.
రూ.987 నుంచి డొమెస్టిక్, రూ.3,699 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లతో పాటు ADDON50 ప్రోమో కోడ్ ఉపయోగించి అన్ని యాడ్ ఆన్స్‌పై అదనంగా 50% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు SCB1000 ప్రోమో కోడ్ ఉపయోగించి స్టాండర్డ్ చార్టర్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసేవారికి అన్ని బుకింగ్స్‌పై మరో రూ.1000 తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన సీట్లకు ఉచితంగా వెజిటేరియన్ సాండ్విచ్ కూడా ఇస్తోంది స్పైస్‌జెట్. ఈ సేల్‌లో ఎన్ని టికెట్లను ఆఫర్ ధరకు అమ్ముతుందో వెల్లడించలేదు స్పైస్‌జెట్. కాబట్టి ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వారికే తక్కువ ధరకు టికెట్లు లభించే అవకాశం ఉంది.ఇవి కూడా చదవండి:
SBI News: ఎస్బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే
Realme 6 Pro: రియల్మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రేపే రియల్మీ 6 ప్రో సేల్
Save Money: కోటీశ్వరులు కావాలా? ఈ జపనీస్ టెక్నిక్ ట్రై చేయండి
Published by:
Santhosh Kumar S
First published:
March 12, 2020, 12:46 PM IST