హోమ్ /వార్తలు /బిజినెస్ /

SpiceJet: విమాన టికెట్ ధర మీరే లాక్ చేసుకోవచ్చు.. స్పైస్‌ జెట్ స్పెషల్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇలా..

SpiceJet: విమాన టికెట్ ధర మీరే లాక్ చేసుకోవచ్చు.. స్పైస్‌ జెట్ స్పెషల్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇలా..

SpiceJet: విమాన టికెట్ ధర మీరే లాక్ చేసుకోవచ్చు.. స్పైస్‌ జెట్ స్పెషల్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇలా..

SpiceJet: విమాన టికెట్ ధర మీరే లాక్ చేసుకోవచ్చు.. స్పైస్‌ జెట్ స్పెషల్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇలా..

SpiceJet: ప్రముఖ బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్(SpiceJet).. గురువారం యూనిక్ సర్వీస్‌ను ప్రకటించింది. ‘స్పైస్ లాక్(Spice Lock)’ అనే పేరుతో స్పైస్ జెట్.. సరికొత్త సదుపాయం ప్రయాణికుల కోసం రీ ఇంట్రడ్యూస్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విమాన టికెట్ ధరలపై పరిమితులను ప్రభుత్వం (Government) ఇటీవల తొలగించిన నేపథ్యంలో ఎయిర్ లైన్స్(Airlines).. ప్రయాణికులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్(SpiceJet).. గురువారం యూనిక్ సర్వీస్‌ను ప్రకటించింది. ‘స్పైస్ లాక్(Spice Lock)’ అనే పేరుతో స్పైస్ జెట్.. సరికొత్త సదుపాయం ప్రయాణికుల కోసం రీ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ సదుపాయం ఉపయోగించుకునేందుకు ఎవరు అర్హులు, ఎంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* 48 గంటలపాటు ధరలు పెరగవు

స్పైస్ జెట్ తీసుకొచ్చిన ఈ ఫేర్ లాకింగ్ సర్వీస్ ద్వారా మీరు ఎంచుకున్న టికెట్ సేల్ కాదు. దాంతో పాటు 48 గంటల పాటు టికెట్ ధరలు పెరగవు. విమాన టికెట్ ధరలపైన పరిమితులను తొలగించిన క్రమంలో ఒక రోజు ఉండే టికెట్ ధర మరొక రోజు ఉండబోదు. డైనమిక్‌గా ప్రైసెస్ చేంజ్ అవుతుంటాయి.

ధర తక్కువ ఉన్నపుడు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా ప్రయాణమెప్పుడో ముందుగా తెలియదు కదా.. అయితే ఒకవేళ ప్రయాణ తేదీ ముందే తెలిస్తే కనుక తక్కువ ధరకే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో టికెట్ ధరను రెండు రోజుల పాటు లాక్ చేసుకునే అవకాశం ‘స్పైస్ లాక్’ ద్వారా స్పైస్ జెట్ అందిస్తోంది.

ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు విమానాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని స్పైస్ జెట్ సంస్థ భావిస్తోంది. గతంలో మెగా మాన్ సూన్ సేల్‌తో పాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్లను అందించిన సంస్థ.. తాజాగా ‘స్పైస్ లాక్(Spice Lock)’ ద్వారా రెండు రోజుల పాటు విమాన ధరలను లాక్ చేసుకునే సదుపాయం కల్పించింది.

విమాన టికెట్ల ధరలు(airfares) ఆకాశానికి తాకక ముందే ఈ సర్వీసు ద్వారా కస్టమర్లు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సీట్ల అందుబాటు, తోటి ప్రయాణికులు, ధరల గురించి వినియోగదారులు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సర్వీసును పేరు చెప్పకుండానే తీసుకోవడం ద్వారా కస్టమర్లు మరింత సురక్షితంగా భావిస్తారని సంస్థ చెబుతోంది.

ఇది కూడా చదవండి : ఎస్‌బీఐ నుంచి ఐసీఐసీఐ వరకు.. కారు లోన్లపై అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు ఇవే..

* నామినల్ ఫీజు రూ.99

‘స్పైస్ లాక్’ సర్వీస్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా వర్తిస్తుంది. కాగా, డొమెస్టిక్ ప్రయాణాలకు(domestic) 7 రోజుల ముందు, ఇంటర్నేషనల్ ప్రయాణాలకు(international flights) 15 రోజుల ముందు వరకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఈ సర్వీసు కోసం నామినల్ ఫీజుగా కేవలం రూ.99 చెల్లిస్తే చాలు.. పేరు కూడా పేర్కొనాల్సిన అవసరం లేదు. ఈ ఫేర్ లాకింగ్ సర్వీస్ ద్వారా కస్టమర్లు ముందుగానే ఫ్లైట్‌లో బుకింగ్స్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఒక రోజు కనిష్టంగా ఉన్న ధరలు మరుసటి రోజునే అత్యంత గరిష్ట మయ్యాయని ఈ సర్వీసు తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Flights, SpiceJet, Travelling

ఉత్తమ కథలు