హోమ్ /వార్తలు /బిజినెస్ /

SpiceJet Sale: స్పైస్‌జెట్ వావ్ వింటర్ సేల్... రూ.1,122 ధరకే ఫ్లైట్ టికెట్

SpiceJet Sale: స్పైస్‌జెట్ వావ్ వింటర్ సేల్... రూ.1,122 ధరకే ఫ్లైట్ టికెట్

SpiceJet Sale | వచ్చే ఏడాది ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? రూ.1,122 నుంచే ఫ్లైట్ టికెట్స్ (Flight Ticket Offer) అందిస్తోంది స్పైస్‌జెట్.

  ఫ్లైట్ జర్నీ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్పైస్‌జెట్ వావ్ వింటర్ సేల్ (SpiceJet Wow Winter Sale) ప్రకటించింది. రూ.1,122 ధర నుంచే ఫ్లైట్ టికెట్స్ (Flight Ticket Offer) అందిస్తోంది. 2021 డిసెంబర్ 27 నుంచి 31 వరకు టికెట్లు బుక్ చేసేవారు ఈ ఆఫర్స్ పొందొచ్చు. 2022 జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించేవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. చెన్నై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై, జమ్మూ నుంచి శ్రీనగర్, చెన్నై నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణించేవారు రూ.1,122 ధరకే ఫ్లైట్ టికెట్ పొందొచ్చు. ఇతర ప్రాంతాల మధ్య జర్నీచేసేవారికి రెగ్యులర్‌గా ఉంటే ఫేర్ కన్నా తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్ కొనొచ్చు.

  ఇక ట్రావెల్ ప్లాన్స్ చేసుకునేవారికి, మార్చుకునేవారికి మరిన్ని ఆఫర్స్ ప్రకటించింది స్పైస్‌జెట్. ఛేంజ్ ఫీజ్‌పై ఒకసారి మినహాయింపు లభిస్తుంది. అంటే ఒకసారి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నవారు ఏవైనా మార్పులు ఉంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా టికెట్ మాడిఫై చేయొచ్చు. అయితే ఫ్లైట్ బయల్దేరడానికి రెండురోజుల ముందు టికెట్ మాడిఫై చేయాలి. ఫేర్‌లో ఏదైనా తేడా ఉంటే మిగతా మొత్తం చెల్లించాలి.

  ఈ సేల్‌లో బుక్ చేసే ప్రతీ టికెట్‌పై రూ.500 విలువైన కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్‌ను కూడా స్పైస్‌జెట్ అందిస్తోంది. ఈ వోచర్‌ను తర్వాత బుక్ చేసే టికెట్లకు ఉపయోగించుకోవచ్చు. కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్లను 2022 జనవరి 15 నుంచి 31 మధ్య రీడీమ్ చేసుకోవాలి. 2022 సెప్టెంబర్ 30 లోపు ప్రయాణ తేదీ ఉండాలి. కనీసం రూ.4,500 చెల్లింపులకే కాంప్లిమెటరీ వోచర్ వర్తిస్తుంది. ఈ వోచర్ ఎవరిపేరు మీద ఉంటే వారు మాత్రమే ఉపయోగించాలి. ప్రయాణ తేదీ కన్నా 15 రోజుల ముందు మాత్రమే రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక బుకింగ్‌కు ఒక వోచర్ మాత్రమే ఉపయోగించొచ్చు.

  ఇక స్పైస్‌మ్యాక్స్ లాంటి యాడ్ ఆన్స్‌పై 25 శాతం ఇన్‌స్టంట్ టికెట్స్ బుక్ చేయొచ్చు. వన్ వే, రౌండ్ ట్రిప్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకోసం కస్టమర్లు ADDON25 ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఒకవైపు డైరెక్ట్ డొమెస్టిక్ టికెట్లు బుక్ చేసుకునేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మొదట బుక్ చేసుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వావ్ వింటర్ సేల్‌లో భాగంగా స్పైస్‌జెట్ అందించే ఆఫర్స్ స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల దగ్గర లభిస్తాయి.

  First published:

  Tags: Flight Offers, Flight tickets, SpiceJet

  ఉత్తమ కథలు