Home /News /business /

SPECIFY EXACT DATES OF LOAN REPAYMENT FOR CUSTOMERS RBI CIRCULAR GH VB

RBI Circular: ఆర్​బీఐ కీలక నిర్ణయం.. కస్టమర్లకు, బ్యాంకులకు కీలక ఆదేశాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) లోన్​ రీపెయిమెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లోన్​ పేమెంట్​ గడువు తేదీని ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) లోన్​ రీపెయిమెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లోన్​ పేమెంట్​ గడువు తేదీని ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. రుణ ఒప్పందాల ప్రకారం, లోన్​ రీపేమెంట్​ తేదీని బ్యాంకులు కచ్చితంగా కస్టమర్​కు మెసేజ్​ రూపంలో తెలియజేయాలని పేర్కొంది. తద్వారా కస్టమర్లు గడువు ముగిసే లోపు తమ నిధులను సమకూర్చుకుంటారని, లోన్​ డిఫాల్డర్లను కొంత మేర అరికట్టవచ్చని తెలిపింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు లోన్​ గడువు తీరే ముందే ప్రతినెలా కస్టమర్లను అలెర్ట్​ చేస్తున్నాయి. అయితే ఒప్పందం చేసుకున్న గడువు తేదీని మాత్రమే ఇవి పేర్కొంటున్నాయి. దీని ద్వారా కస్టమర్లు కన్​ఫ్యూజ్​ అయ్యే ప్రమాదం ఉందని ఆర్​బీఐ నవంబర్​ 12న విడుదల చేసిన సర్క్యులర్​లో పేర్కొంది.

Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


“ఇక మీదట, రుణాన్ని తిరిగి చెల్లించడానికి కచ్చితమైన గడువు తేదీలు, తిరిగి చెల్లించే ఫ్రీక్వెన్సీ, అసలు, వడ్డీ, స్పెషల్​ మెన్షన్​ అకౌంట్ (SMA), నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA) వర్గీకరణ తేదీలను ఆయా బ్యాంకులు రుణ ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొనాలి. రుణగ్రహీతకు ఆయా వివరాలను ఖచ్చితంగా తెలియజేయాలి." అని సర్క్యులర్​లో పేర్కొన్నారు.

దీనికి అదనంగా, మారటోరియం సదుపాయంతో వచ్చే రుణాల విషయంలో పేమెంట్​ ప్రారంభమయ్యే తేదీని కచ్చితంగా తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆర్​బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. కాగా, ఈ ఆదేశాలని తప్పకుండా 2021 డిసెంబర్ 31లోపు అమలు చేయాలని అన్ని బ్యాంకులను కోరింది. ఇప్పటికే తీసుకున్న లోన్లతో పాటు కొత్తగా తీసుకునే లోన్ల విషయంలోనూ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


డిసెంబర్​ 31లోపు అమలు చేయాలి..
వడ్డీ, అసలుతో సహా మొత్తం బకాయిల చెల్లింపును రుణగ్రహీత తిరిగి చెల్లించినప్పుడు మాత్రమే ఎన్​పీఏలను స్టాండర్డ్​ అసెట్​ క్లాస్​గా అప్‌గ్రేడ్ చేయవచ్చని ఆర్​బీఐ తెలిపింది. కాగా, గతంలో కేవలం వడ్డీ చెల్లించిన తర్వాత మాత్రమే బ్యాంకులు ఎన్​పీఏ ఖాతాను తిరిగి స్టాండర్డ్​ అసెట్​ క్లాస్​గా వర్గీకరించేవి. మరోవైపు, గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా త్రైమాసికంలో చెల్లించాల్సిన వడ్డీని, త్రైమాసికం ముగిసిన 90 రోజుల్లోపు పూర్తిగా చెల్లించకపోతే ఆయా ఖాతాలను నాన్​ పర్ఫార్మింగ్​ అసెట్​(ఎన్​పీఏ) జాబితాలో పేర్కొనేవారు.

Nallamala Tourism: నల్లమల టూరిజం ప్యాకేజీ.. పెద్ద పులులతో పాటు.. నల్లమల అందాలను చూసే విధంగా ఏర్పాట్లు..


ఇప్పుడు ఈ నిబంధనను సవరించింది. అంతేకాదు, క్యాష్​ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ (సీసీ/ఓడీ)కి సంబంధించిన సీసీ/ఓడీ అకౌంట్​ను అవుట్ ఆఫ్ ఆర్డర్​గా పరిగణించవచ్చని సర్క్యులర్ స్పష్టం చేసింది. అలాగే ఈ కొత్త నిబంధనలపై కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు సర్క్యులర్లను ఆయా బ్యాంకు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆర్​బీఐ పేర్కొంది.
Published by:Veera Babu
First published:

Tags: Business, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు