Home /News /business /

SPECIFICATIONS OF EARTH ENERGY EV GLYDE PLUS MK

Earth Energy Glyde Plus: ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...100 కిమీల వరకు మైలేజ్...కిలోమీటర్ కు అర్థరూపాయి ఖర్చు..

Earth Energy Glyde Plus

Earth Energy Glyde Plus

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏ ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా. అయితే తక్కువ ధరలో లాంగ్ రేంజ్‌ను అందించే ఆ ఎలక్ట్రిక్ (Electric Scooter ) స్కూటర్ గురించి తెలుసుకుందాం. భారతీయ కంపెనీ ఎర్త్ ఎనర్జీ తయారు చేసిన ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్ గ్లేడ్ ప్లస్ (Glyde Plus) స్పోర్టి డిజైన్‌తో ఆకర్షణీయమై రంగుల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఇంకా చదవండి ...
    దేశంలో ఎలక్ట్రిక్ (Electric Scooter) వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ ( Electric Scooter) కార్ల కంటే ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్లు, బైక్‌లకు కస్టమర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.మీరు కూడా ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏ ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా. అయితే తక్కువ ధరలో లాంగ్ రేంజ్‌ను అందించే ఆ ఎలక్ట్రిక్ (Electric Scooter ) స్కూటర్ గురించి తెలుసుకుందాం. భారతీయ కంపెనీ ఎర్త్ ఎనర్జీ తయారు చేసిన ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్ గ్లేడ్ ప్లస్ (Glyde Plus) స్పోర్టి డిజైన్‌తో ఆకర్షణీయమై రంగుల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ ( Electric Scooter) స్కూటర్  బ్యాటరీ, పవర్ విషయానికి వస్తే కంపెనీ 4.2 kW మోటార్‌తో 52 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తోంది.  ఈ బ్యాటరీ ప్యాక్‌కు సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు కేవలం 40 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

    Jio Cashback: ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్ ఇస్తున్న జియో

    ఈ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, గరిష్టంగా గంటకు 85 కిమీ వేగంతో 100 కిమీల వరకు మైలేజ్ ఇస్తుంది. స్కూటర్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ముందు, వెనుక చక్రాలలో డిస్క్ బ్రేక్స్ అందించారు. స్కూటర్ ఫీచర్ల జోలికి వస్తే దీనికి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ యాప్ అందించారు. దీని సహాయంతో మీరు రైడ్ స్టేటస్, లైవ్ లొకేషన్, వెహికల్ ట్రాకింగ్, దొంగతనం నుంచి రక్షణ వంటి అనేక అధునాతన ఫీచర్‌లను పొందవచ్చు. దీని ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, డిజిటల్ డిస్‌ప్లే, డిజిటల్ క్లాక్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ కన్సోల్ వంటి ఫీచర్లు ఇందులో పొందుపరిచారు.

    Desh Bhakti offer: చైనా మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ ఫ్రీ

    స్కూటర్ ధర విషయానికి వస్తే  కంపెనీ దీనిని ప్రారంభ ధర రూ. 98,175 అని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ తర్వాత, దీని ధర తగ్గుతుంది. మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు దీన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు, దీని కోసం కంపెనీ రూ. 999 టోకెన్ మొత్తాన్ని నిర్ణయించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Electric Scooter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు