Fixed Deposit | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి అలర్ట్. స్పెషల్ ఎఫ్డీ (FD) స్కీమ్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అందుబాటులో ఉండదు. అందువల్ల బ్యాంక్‌లో (Bank) డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని భావించే వారు ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అధిక వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు.
ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్ల కోసం స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. 2022 నవంబర్ 1 నుంచి ఈ స్కీమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ గడువు దగ్గరకు వచ్చింది. ఈ నెల చివరి వరకే ఈ పథకం కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అటుపైన లభించదు. అందువల్ల మీరు డబ్బులు ఎఫ్డీ చేయాలంటే వెంటనే చేసేయడం ఉత్తమం.
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. డిసెంబర్ 12లోపు ఇలా చేయండి, లేదంటే అకౌంట్ పని చేయదు!
స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ విషయానికి వస్తే.. ఇది టెన్యూర్ 999గా ఉంది. ఈ ఎఫ్డీపై 8 శాతం వడ్డీ లభిస్తోంది. ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేటు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే ఇంకో 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ లభిస్తుంది. మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వారి పేరుపై బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్డీ చేయొచ్చు.
ఈ 2 స్కీమ్స్‌తో నెల నెలా చేతికి డబ్బులు.. ప్రతి నెలా రూ.9 వేలకు పైగా పొందొచ్చు!
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది. అంటే ఈ ఎఫ్డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ వడ్డీ రేటును పొందొచ్చు. నవంబర్ 30తో ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. 999 రోజుల స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ నవంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ ఎఫ్డీ రేట్లు గమనిస్తే.. 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్డీలపై 4 శాతం వడ్డీ వస్తుంది. 15 రోజుల నుంచి 59 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం వడ్డీ ఉంది. 60 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ పొందొచ్చు. 91 రోజుల నుంచి 182 రోజలు ఎఫ్డీలపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 183 రోజుల నుంచి ఏడాది ఎఫ్డీలపై 5.5 శాతం వడ్డీ ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై 6.6 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 2 ఏళ్ల నుంచి 998 ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీ ఉంది. 1000 రోజుల నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25 శాతం పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Personal Finance