Home /News /business /

SPECIAL DISCOUNT FOR CUSTOMERS WHO HAVE TAKEN BOTH THE VACCINES CHECK IMMEDIATELY MK

GoFirst special discount: రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నారా...అయితే బంపర్ ఆఫర్..ఎంచక్కా విమాన టికెట్‌లో డిస్కౌంట్ పొందండిలా...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కొన్ని సంస్థలు వ్యాక్సిన్ ను తప్పనిసరి చేశారు. అయితే తాజాగా గో-ఫస్ట్ ఎయిర్‌లైన్ పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులకు బేస్ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం GoFirst వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి ...
    ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ లు జోరందుకున్నాయి. రెండు వ్యాక్సిన్లు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో వ్యాక్సిన్లు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్లను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు వ్యాక్సిన్ ను తప్పనిసరి చేశారు. అయితే తాజాగా   గో-ఫస్ట్ ఎయిర్‌లైన్ పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులకు బేస్ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం GoFirst వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వ్యాక్సిన్ , రెండు డోసులను తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. GoFirst దాని వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం టీకాను తీసుకోండి. GoFirstతో రెట్టింపు ప్రయోజనాలను పొందండని ప్రచారం మొదలుపెట్టింది. Go-First GOVACCI ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది.

    GoFirst ప్రత్యేక తగ్గింపు ఆఫర్

    GOVACCI అనేది దేశీయ విమానాల కోసం మాత్రమే బుక్ చేసుకునే సమయంలో భారతదేశంలో నివసిస్తున్న , రెండు వ్యాక్సిన్‌లను తీసుకున్న ప్రయాణీకులకు వర్తించే ఆఫర్. ప్రయాణీకులు భారత ప్రభుత్వంలోని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వారి COVID-19 టీకా సర్టిఫికేట్ మీ ప్రయాణం సమయంలో దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్‌లో ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో మీ వ్యాక్సినేషన్ స్టేటస్‌ని చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది.



    మీరు ఫ్లైట్ బుకింగ్ సమయంలో మీరు రెండు షాట్‌లు తీసుకున్నారని , డిస్కౌంట్ పొందారని మీరు చెబితే కానీ మీరు రెండు వ్యాక్సిన్‌లను తీసుకున్నారని మీరు నిరూపించలేకపోతే, ఆ మినహాయింపు మీ నుండి ఉపసంహరించబడుతుంది. మిగిలిన మొత్తాన్ని మీరు చెల్లించాలి.



    GoFirst ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ప్రయోజనాన్ని పొందండి

    >> ప్రోమో కోడ్‌ల విభాగంలో GOVACCI ప్రోమో కోడ్‌ను నమోదు చేయాలి.

    >> దేశీయ విమానాలలో మీరు 20% వరకు తగ్గింపు పొందవచ్చు.

    >> దేశీయ విమానాల బేస్ ఫేర్ లేదా బేస్ ఫేర్‌పై ఈ 20 శాతం తగ్గింపు పొందవచ్చు

    >> మీ ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు మీరు బుక్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

    >> బుకింగ్‌పై ఈ ఆఫర్ 31 జనవరి 2022 వరకు చెల్లుతుంది. 31 మార్చి 2022 వరకు ప్రయాణించవచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Business Ideas

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు