SOVEREIGN GOLD BONDS SCHEME 2022 23 CENTRE TO ISSUE FIRST TRANCHE ON 20 JUNE UMG GH
Sovereign Gold Bonds: ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూన్ 20 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ ప్రారంభం
సావరిన్ గోల్డ్ బాండ్స్ 2022-23-సిరీస్ I సబ్స్క్రిప్షన్ జూన్ 20 తేదీన ఆరంభమై జూన్ 24న ముగుస్తుంది.
గోల్డ్ ఇన్వెస్టర్ల (Gold Investors) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. 2022-23కి గానూ మొదటి విడత సావరిన్ గోల్డ్ బాండ్లు (Sovereign Gold Bonds) జూన్ 20 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది.
గోల్డ్ ఇన్వెస్టర్ల (Gold Investors) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. 2022-23కి గానూ మొదటి విడత సావరిన్ గోల్డ్ బాండ్లు (Sovereign Gold Bonds) జూన్ 20 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోనే ఉంటాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండో విడత (Second Tranche) లేదా 2022-23 సిరీస్ II బాండ్లు ఆగస్టు 22 నుంచి 26 తేదీల్లో సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.
సావరిన్ గోల్డ్ బాండ్స్ 2022-23-సిరీస్ I సబ్స్క్రిప్షన్ జూన్ 20 తేదీన ఆరంభమై జూన్ 24న ముగుస్తుందని ఇన్వెస్టర్లు గమనించాలి. అయితే జూన్ 28న బాండ్స్‌ను ఆర్బీఐ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయించనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా చెప్పుకున్నట్లు 2022-23 సిరీస్ II సబ్‌స్క్రిప్షన్‌ను ఆగస్టు 22 నుంచి 26 వరకు ఓపెన్ చేయనుండగా.. బాండ్స్ ఆగస్టు 30న జారీ అవుతాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్ భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ అవుతాయి. ఈ బాండ్లను ఎవరెవరికి విక్రయించాలనే విషయంతోపాటు పెట్టుబడి పరిమితిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
భారత పౌరులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు(HUF), ట్రస్ట్‌లు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు ఈ బాండ్లను ప్రభుత్వం విక్రయిస్తుంది. పెట్టుబడిదారులు ఒక గ్రాము బంగారం నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రకారం, కనీస పెట్టుబడి ఒక గ్రాము బంగారం కాగా గరిష్ట పరిమితిని ఒక వ్యక్తికి 4 కేజీలు, హెచ్‌యూఎఫ్(Hindu Undivided Family- HUF)లకు 4 కేజీలు, ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్‌లు, అలాంటి మరిన్ని సంస్థలకు 20 కిలోలుగా నిర్ణయించింది. జాయింట్ హోల్డింగ్ దరఖాస్తుదారుల విషయానికి వస్తే.. 4 కేజీల ఇన్వెస్ట్మెంట్ లిమిట్ మొదటి దరఖాస్తుదారుకు మాత్రమే వర్తిస్తుంది. వీటి మెచ్యూరిటీ పీరియడ్ 8 సంవత్సరాలుగా ఉండగా.. పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత పథకం నుంచి బయటికి రావచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్స్ ధర విషయానికి వస్తే.. సబ్స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు వర్కింగ్ డేస్‌లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) పబ్లిష్ చేసిన 999 ప్యూర్ గోల్డ్ సగటు క్లోజింగ్ ప్రైస్ ఆధారంగా బాండ్స్ ధర నిర్ణయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ బాండ్స్ ధర ఇండియన్ రుపీస్లో ఉంటుందని గమనించాలి. ఆసక్తిగల కొనుగోలుదారులు నగదు ద్వారా గరిష్టంగా రూ.20,000 వరకు చెల్లించి బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా ఇష్యూ ప్రైస్ చెల్లించవచ్చు. జారీ చేసిన తర్వాత, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్‌ను పెట్టుబడిదారులు పొందుతారు. ఈ సర్టిఫికెట్‌ను డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.