Home /News /business /

SOVEREIGN GOLD BONDS AVAILABLE WITH OVER 10 PER CENT DISCOUNT IN SECONDARY MARKET KNOW HOW TO PURCHASE SS

Discount on Gold: మార్కెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌తో బంగారం... ఇలా కొనండి

Discount on Gold: మార్కెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌తో బంగారం... ఇలా కొనండి
(ప్రతీకాత్మక చిత్రం)

Discount on Gold: మార్కెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్‌తో బంగారం... ఇలా కొనండి (ప్రతీకాత్మక చిత్రం)

Discount on Gold | మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తోంది. 10 శాతం కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో బంగారం కొనొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    రెండేళ్ల తర్వాత బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది. మీరు ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్‌తో బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చు. స్వచ్ఛమైన బంగారం రూ.50,000 లోపే దొరుకుతోంది. ఎలాగో తెలుసుకునేముందు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.54,330 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.49,800 ధరకు చేరుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ.2,100 పెరిగి రూ.76,700 ధరకు చేరుకుంది.

    బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) రూపంలో మంచి అవకాశం లభిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతీ నెలా సావరిన్ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తుంది. ఇటీవల సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. అయితే సెకండరీ మార్కెట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్లను డిస్కౌంట్‌లో కొనొచ్చన్న విషయం తక్కువ మందికే తెలుసు. సెకండరీ మార్కెట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్లు 10 నుంచి 15 శాతం డిస్కౌంట్‌లో లభిస్తుంటాయి.

    PF Account: పీఎఫ్ అకౌంట్ ఉందా? రెండు రోజుల్లో గుడ్ న్యూస్

    బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో SGBOCT27 సావరిన్ గోల్డ్ బాండ్ ధర రూ.4,737 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఒక గ్రాము ధర రూ.4,737. సావరిన్ గోల్డ్ బాండ్ స్వచ్ఛమైన బంగారంతో సమానం. అంటే సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో ఒక గ్రాము స్వచ్ఛమైన గోల్డ్ రూ.4,737 ధరకే లభిస్తుండటం విశేషం. అదే ఓపెన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము కొనాలంటే రూ.5,433 చెల్లించాలి. అంటే ఒక గ్రాముపై 10 శాతం పైనే రూ.696 డిస్కౌంట్ లభిస్తుంది. 10 గ్రాములు కొంటే రూ.6960 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే సుమారు రూ.7,000 డిస్కౌంట్ లభిస్తోంది.

    సెకండరీ మార్కెట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గోల్డ్ బాండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో చెక్ చేయాలి. SGBOCT27 బాండ్ 2027 అక్టోబర్‌లో మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు అప్పటి వరకు ఈ బాండ్ హోల్డ్ చేసి రీడీమ్ చేసుకోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో వేర్వేరు కాలవ్యవధులతో గోల్డ్ బాండ్స్ లభిస్తాయి.

    Gold Price: షాకిస్తున్న గోల్డ్ రేట్... రికార్డ్ ధర వైపు బంగారం పరుగులు

    సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే ఫిజికల్ గోల్డ్ రాదు. ఇది డిజిటల్ గోల్డ్ లాంటిదే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్‌బీఐ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించినప్పుడు కొనే సావరిన్ గోల్డ్ బాండ్‌కు ఎనిమిదేళ్ల వ్యవధితో లభిస్తుంది. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవారు ముందుగానే సెకండరీ మార్కెట్‌లో అమ్మేయొచ్చు. అందుకే సెకండరీ మార్కెట్‌లో డిస్కౌంట్‌లో ఈ బాండ్స్ లభిస్తాయి. తాము కొన్న గోల్డ్ బాండ్స్‌పై మంచి లాభాలు వచ్చినా, అత్యవసరంగా డబ్బులు అవసరమైనా గోల్డ్ బాండ్స్ అమ్మేస్తుంటారు.

    మీరు మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్స్ హోల్డ్ చేస్తారనుకుంటేనే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనాలి. వేర్వేరు కాల వ్యవధుల్లో మెచ్యూర్ అయ్యే బాండ్స్ సెలెక్ట్ చేయాలి. ఒకే బాండ్ ఎక్కువగా కొంటే, మీ బాండ్ మెచ్యూర్ అయ్యేసరికి బంగారం ధర తక్కువగా ఉంటే నష్టపోవాల్సి వస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌ను మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే ప్రతీ ఏడాది 2.5% వడ్డీ చొప్పున లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంత చెల్లిస్తుంది ఆర్‌బీఐ.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Gold, Gold Price Today, Gold rates, Silver price, Sovereign Gold Bond Scheme

    తదుపరి వార్తలు