Gold Bonds: పెరుగుతున్న బంగారం ధరల్లో లాభాలు పొందాలని ఉందా...? అయితే ఇది మీకోసమే...?

బంగారం ఈటీఎఫ్ ఫండ్స్ అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ తరహా లాంటివి ఇందులో పెట్టిన మొత్తాన్ని బంగారంలో మదుపు చేస్తారు. డీమ్యాట్ రూపంలో ఈటీఎఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇక బంగారం బాండ్స్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు ఇందుకోసం ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పేరిట 2015లో ఒక పథకం ప్రారంభించింది.

news18-telugu
Updated: September 7, 2019, 7:18 PM IST
Gold Bonds: పెరుగుతున్న బంగారం ధరల్లో లాభాలు పొందాలని ఉందా...? అయితే ఇది మీకోసమే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఓవైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు, అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు తమ ప్రభను కోల్పోతున్నాయి. అలాగే బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బంగారంలో చట్టబద్ధంగా ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు. కొందరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడులు పెడుతుంటే, మరికొందరు ఫిజికల్ బంగారాన్ని బిస్కెట్లు, కాయిన్లు, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆభరణాల బంగారం నాణ్యత మేలిమి బంగారం కన్నా తక్కువగా ఉంటుంది. ఆభరణాల్లో వాడే బంగారంలో 22 కేరట్ల బంగారం వాడుతుంటారు. అయితే ఆభరణాల్లో తరుగు రూపంలోనూ, మేకింగ్ చార్జెస్ రూపంలో ఖర్చులు తోడవుతుంటాయి. అందుకే పెట్టుబడుల కోసం బంగారు ఆభరణాల కొనుగోలు వైపు ఎక్కువగా చూడవద్దని బులియన్ నిపుణుల సలహా, అయితే బంగారం లాభాలను ఒడిసి పట్టుకోవాలంటే మాత్రం ఫిజికిల్ బంగారం కన్నా బాండ్లు, ఈటీఎఫ్ ఫండ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

బంగారం ఈటీఎఫ్ ఫండ్స్ అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ తరహా లాంటివి ఇందులో పెట్టిన మొత్తాన్ని బంగారంలో మదుపు చేస్తారు. డీమ్యాట్ రూపంలో ఈటీఎఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇక బంగారం బాండ్స్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు ఇందుకోసం ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పేరిట 2015లో ఒక పథకం ప్రారంభించింది. ప్రస్తుతం తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం 2019-20 నాల్గవ సిరీస్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ స్కీం ప్రకారం గోల్డ్ బాండ్ ధర ఒక గ్రాముకు రూ.3840గా నిర్ణయించారు. నిర్దేశిత బ్యాంకులు, పోస్టాఫీసులు ద్వారా ఈ సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆన్ లైన్ ద్వారా బాండ్లు కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్ సైతం లభిస్తోంది. ఈ బాండ్ల ద్వారా ఒక్కో వ్యక్తి 500 గ్రాముల బంగారం కొనుగోలు చేసే వీలుంది. ఇక ట్రస్టుల ద్వారా 20 కేజీలు, హిందు అవిభాజ్య కుటుంబం 4 కేజీల వరకూ బంగారం కొనుగోలు చేయవచ్చు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>