HOME » NEWS » business » SOVEREIGN GOLD BOND TO GOLD MUTUAL FUND KNOW ABOUT GOLD INVESTMENT OPTIONS SS GH

Gold: డబ్బు తక్కువగా ఉందా? అయినా బంగారం కొనొచ్చు ఇలా

Gold Investment Options | మీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? బంగారం కొని భవిష్యత్తు కోసం దాచుకోవాలనుకుంటున్నారా? తక్కువ డబ్బుతో బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 23, 2020, 1:04 PM IST
Gold: డబ్బు తక్కువగా ఉందా? అయినా బంగారం కొనొచ్చు ఇలా
Gold: డబ్బు తక్కువగా ఉందా? అయినా బంగారం కొనొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జనాన్ని ఆకర్షించడంలో బంగారం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా భారత్ లో చాలా కుటుంబాలు బంగారాన్ని ఆభణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తాయి. ఏదేమైనా ప్రస్తుత ధరల్లో పసిడి ధర(10 గ్రాములు రూ.50000) రెట్టింపు స్థాయిలో ఆకాశాన్నింటింది. ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్య సమస్యలతో పాటు మహమ్మారి కారణంగా చాలా మంది ప్రజలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పసిడిని కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టాల్సిన పనిలేదు. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFలు, SGBలు లాంటివి బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇతర మార్గాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడుల రంగంలో అనుభవం లేని వారికి కూడా ఇవి ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెరుగుతున్న ధరలు భౌతిక యాజమాన్యాంలో ఇబ్బందులను సృష్టించినపుడు పండగ సీజన్ లో కనీస ఖర్చులకు వ్యతిరేకంగా మీ కోసం మీకిష్టమైనవారి కోసం బంగారాన్ని డిజిటల్ గా పొందవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ బంగారండిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడమనేది అనుకూలమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది. ప్రస్తుత మార్కెట్ ధర వద్ద ఎప్పుడైనా 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడిని కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.. అలాగే సేకరించవచ్చు. మీరు కొనుగోలు చేసిన బంగారం సురక్షితమైన వాల్టుల్లో నిల్వచేస్తారు. అంతేకాకుండా బీమా చేస్తారు. పెట్టుబడి ప్లాట్ ఫామ్ లు మీ సొంత ఆస్తిని భౌతిక రూపంలో పొందడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది కాకుండా ప్రజలకు ముఖ్యంగా పెట్టుబడుల గురించి ముందస్తు జ్ఞానం లేనివారికి పెరిగి సౌలభ్యం డిజిటల్ బంగారానికి అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరైనా తమ ఇళ్ల నుంచి బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు.

Gold Loan: ఈ విషయాలు తెలుసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకుంటే నష్టపోతారు

Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా

గోల్డ్ ETFలు


గోల్డ్ ఎక్స్ ఛేంజ్, ట్రేడెట్ ఫండ్లు నేరుగా స్టాక్ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసి విక్రయిస్తారు. అందువల్ల అలాంటి గోల్డ్ ఆస్తిని కాగితంపై కలిగి ఉండటం భౌతిక యాజమాన్యానానికి సమానంగా ఉంటుంది. గోల్డ్ స్టాక్ ధరలు మార్కెట్లో దాని ధరలకు దగ్గరగా పోలి ఉంటాయి. మీరు ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా డిమాట్ ఖాతా ప్రారంభించాలి.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు


ఈ నిధులు బంగారు నిల్వల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడులు పెడతాయి. సాధారణంగా మైనింగ్ కంపెనీలు స్టాక్స్, భౌతిక బంగారం, గోల్డ్ ఉత్పత్తి, పంపిణీ ఆదారం స్టాక్స్ లో పెట్టుబడి పెడతారు. ఈ నిధుల పనితీరు సాధారణంగా దేశంలో బంగారు ధర పనితీరుతో ముడిపడి ఉంటుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్


వీటినే SGBలని కూడా అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది. ప్రతి ఏడాది 2.5 శాతం హామి రాబడి అందిస్తుంది. ఈ బాండ్లలో మీరు పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం ఒక గ్రాముకు బంగారం విలువకు సమానంగా ఉంటుంది. అయితే అలాంటి బాండ్లకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు. బదులుగా, ఆర్బీఐ పీరియాడిక్ విండోలను తెరుస్తుంది. ఈ సమయంలో ఇది పెట్టుబడిదారులకు విక్రయిస్తుంది. అయితే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే ఈ పెట్టుబడి ఆచరణీయమైన ఎంపిక కోసం చేస్తుంది. SGBలకు మెచ్యురిటీ టర్మ్ వచ్చేసి 8 సంవత్సరాలు.

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా

Gold Scheme: గోల్డ్ స్కీమ్‌లో చేరుతున్నారా? ఈ విషయం మార్చిపోవద్దు

ఇవి కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది ఆభరణాలు వాయిదా పద్దతుల్లో పెట్టుబడులు పెట్టడానికి బంగారు పొదుపు పథకాలను ప్రజలకు అందిస్తున్నాయి. సాధారమంగా ఓ స్వర్ణాకారుడు ప్రతి నెల నిర్దిష్ట వ్యవధికి నిర్ణీత మొత్తాన్ని జమ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పదవీకాలం ముగిసిన తర్వాత మీరు అదే ఆభరణాల నుంచి బంగారాన్ని డిపాజిట్ చేసిన మొత్తానికి సమానమైన విలువతో పాటు బోనస్ కొనుగోలు చేయవచ్చు. పరిపక్వత చేరుకున్న తర్వాత బంగారాన్ని ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు.

మీరు గమనిస్తే.. బంగారం యాజమాన్యం మీ బ్యాంక్ హోమ్ లాకర్లలో మీకు ఉన్నదానికి పరిమితం కాదు. యాజమాన్యం కోసం బంగారాన్ని భద్రపరచడానికి మీరు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నేడు నామమాత్రపు ఖర్చులతో పెట్టుబడుల ద్వారా విలువైన లోహాన్ని సొంతం చేసుకునే అవకాశం భారీ పరివర్తనకు గురైంది. అందువల్ల ఈ సీజన్ లో డిజిటల్ కాగితపు బంగారాన్ని షాట్ ఇవ్వండి.
Published by: Santhosh Kumar S
First published: November 23, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading