హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sovereign Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం కొనండి ఇలా

Sovereign Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం కొనండి ఇలా

ప్రధానంగా బంగారం తయారీలో వాడే 22  క్యారెట్ల  బంగారం పది గ్రాముల ధర ఇవాళ 47 వేల 300 రూపాయలు ఉంది.. ఇక 24 క్యారెట్ల  బంగారం పది గ్రాముల ధర  48,300 రూపాయలుగా ఉంది.. నిన్న, మొన్న కూడా ఇవే ధరలు కొనసాగాయి. ప్రస్తుతం స్థిరంగానే ధరలు ఉండడంతో కొనుగోలు చేయడానికి సరైన సమయమే మంటున్నారు వ్యాపార నిపుణులు

ప్రధానంగా బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇవాళ 47 వేల 300 రూపాయలు ఉంది.. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48,300 రూపాయలుగా ఉంది.. నిన్న, మొన్న కూడా ఇవే ధరలు కొనసాగాయి. ప్రస్తుతం స్థిరంగానే ధరలు ఉండడంతో కొనుగోలు చేయడానికి సరైన సమయమే మంటున్నారు వ్యాపార నిపుణులు

Sovereign Gold Bond | బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి గుడ్ న్యూస్. సావరిన్ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ (SGB Subscription) మొదలైంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆరో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్​బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు 5 రోజుల పాటు ఈ బాండ్లు తెరిచి ఉంటాయి. కొనుగోలు చేసిన గోల్డ్ బాండ్లకు (Gold Bonds) సెప్టెంబర్ 7న సర్టిఫికెట్​ జారీ చేస్తారు. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం (Gold Price) కొనడానికి ఇది మంచి అవకాశం. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్స్ సరైన ఆప్షన్. ఆభరణాల కోసం అయితే ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది.

ఎస్​జీబీ అంటే ఏమిటి?


సావరిన్ గోల్డ్ బాండ్లను భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం తరపున ఆర్​బీఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసేవారు, వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.

New Rules in September: సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన 7 కొత్త రూల్స్ ఇవే

గ్రాము ధర ఎంత?


ఈ విడతలో ఒక గ్రాము బంగారం ధరను రూ. 4,732గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర రూ.4,849. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్​ 3 వరకు అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కొత్త ఈ–సేవా పోర్టల్ http://onlinesbi.com ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఎస్​బీఐ పేర్కొంది.

ఎస్​జీబీ​​లపై డిస్కౌంట్ ఉందా?


సావరిన్​ గోల్డ్​ బాండ్లలో పెట్టుబడి పెట్టే వారికి నామినల్​ వాల్యూపై గ్రాముకు రూ.50 తగ్గింపు అందిస్తోంది. డిజిటల్​ మోడ్​లో పెట్టుబడి పెట్టేవారికే ఈ ఆఫర్​ వర్తిస్తుంది. ఆఫర్​ కింద గ్రాము గోల్డ్ బాండ్ ఇష్యూ ధర కేవలం రూ. 4,682 గా ఉంటుందని ఆర్​బీఐ తెలిపింది.

EPFO Aadhaar Link: ఈపీఎఫ్-ఆధార్ నెంబర్ లింకింగ్‌కు 2 రోజులే గడువు... వెంటనే ఇలా చేయండి

ఎస్​జీబీ ప్రయోజనాలు ఏంటి?


ఎస్​జీబీల్లో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే, బంగారం విషయంలో ఇరత ఛార్జీలు, స్వచ్ఛత వంటి సమస్యల ఉండవు. ఇవి కాకుండా, ఎస్​జీబీలను ఆర్​బీఐ డీమ్యాట్ రూపంలో నిర్వహిస్తారు.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?


ఎ) విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 కింద భారతదేశంలో నివసించే ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.

బి) హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్​యూఎఫ్​), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు.

సి) మైనర్ల తరపున వారి సంరక్షకులు మైనర్ ఎస్​జీబీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 12 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

ఎస్​జీబీలను విక్రయించే ఏజెన్సీలు


జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), అధీకృత స్టాక్ ఎక్స్ఛేంజీల కార్యాలయాలు లేదా శాఖలు.

కనీస, గరిష్ట పరిమితి?


ఎస్​జీబీలో కనీసం ఒక గ్రాము పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఇక వ్యక్తులైతే గరిష్టంగా 4 కేజీల వరకు , హెచ్​యూఎఫ్​లు 4 కేజీలు, ట్రస్ట్‌లు 20 కేజీల వరకు పెట్టుబడికి అనుమతి ఉంటుంది.

ఎస్​జీబీలపై చెల్లించే వడ్డీ రేటు?


ఎస్​జీబీలు సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 లో 43) నిబంధనల ప్రకారం, ఎస్​జీబీలపై వడ్డీ మినహాయింపు ఉంటుంది. అయితే ఈ బాండ్‌పై TDS వర్తించదు.

First published:

Tags: Gold, Gold price, Gold rate, Gold rate hyderabad, Personal Finance, Sovereign Gold Bond Scheme

ఉత్తమ కథలు