కేంద్ర ప్రభుత్వం (Central Govrenment) ఎనిమిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను (Sovereign Gold Bonds) ప్రారంభించింది. నవంబరు 29 సోమవారం నుంచి డిసెంబరు 3 శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటాయి. ఆర్బీఐ (RBI) ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఫథకంలో పెట్టుబడి (Investment) పెట్టేందుకు భారత్ లో నివసిస్తున్నవారు ఎవరైనా అర్హులే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8వ సిరీస్ గా వచ్చిన ఈ స్కీమ్‌కు సంబంధించి జారీ ధరను కూడా నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ (Finance Ministry) నోటిఫికేషన్ తెలిపింది. బాండ్ ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,791గా నిర్దేశించింది. గత నెలలోనూ ఆర్బీఐ ఇదే ధరను నిర్ణయించింది.
సావరిన్ గోల్డ్ బాండ్లను అక్టోబరు 2021 నుంచి మార్చి 2022 వరకు నాలుగు విడతలుగా జారీ చేయనున్నట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేటును నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50 శాతంగా నిర్దేశించింది. సావరిన్ గోల్డ్ బాండ్లు బంగారు గ్రాముల రూపంలో 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెక్యూరిటీలు. 999 స్వచ్ఛత ఉన్న బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా రూపాయిల్లో నిర్ణయిస్తారు. సబ్ స్క్రిప్షన్ పీరియడ్ కు ముందు వారంలో, చివరి మూడు పనిదినాలకు బాండ్ జారీ ధరను ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురిస్తుంది. 999 స్వచ్ఛత ఆధారంగా రిడమ్షన్ ధరను నిర్దేశిస్తుంది. ఈ ఏడాది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెటిల్మెంట్ తేదీని డిసెంబరు 7గా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
EPFO Alert: ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ కావాలంటే రేపటిలోగా ఈ పనిచేయండి
* బంగారంపై డిస్కౌంట్..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని డిజిటల్ విధానంలో పేమెంట్ చేసే వారికి ప్రభుత్వం డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఆర్బీఐ సలహా మేరకు గ్రాము బంగారానికి విధించిన జారీ ధరపై రూ.50 రాయితీ ఉంది. ఫలితంగా ఆన్ లైన్ పేమెంట్ చేసి ఒక గ్రాము గోల్డ్ బాండ్ కొనుగోలు చేసిన వారికి ఆ బాండ్ రూ.4741కు లభిస్తుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్-1999 ప్రకారం భారత్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ట్రస్టీలు, యూనివర్సీటీలు, చారిటబుల్ సంస్థలు కూడా ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
Home Loan Fee: హోం లోన్ తీసుకోవాలంటే తప్పకుండా ఈ ఫీజులు చెల్లించాలి.. అవేంటంటే?
మైనర్లు కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు, అయితే సదరు దరఖాస్తుదారుని అప్లికేషన్ పై గార్డియన్ సంతకం ఉండాలి. నగదు లావాదేవీల కోసం ఎవరైనా ఓ వ్యక్తి గరిష్ఠంగా రూ.20 వేల వరకు పేమెంట్ చేసి గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ లోనే కాకుండా డిమాండ్ డ్రాఫ్ట్, చెక్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ రూపంలో కూడా పేమెంట్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Reserve Bank of India, Sovereign Gold Bond Scheme