బంగారం కొనాలనుకునేవారికి మరో అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ ధరను భారీగా తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 11 ఒక గ్రాముకు రూ.4,912 ఫిక్స్ చేసింది ఆర్బీఐ. సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేసేందుకు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛమైన బంగారానికి నిర్ణయించిన ధరలను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్బీఐ. గత మూడు బిజినెస్ డేస్‌లో స్వచ్ఛమైన బంగారానికి ఉన్న ధరని యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ రేటుకు గోల్డ్ బాండ్ అమ్మలేదు. ఓసారి ఇటీవల గోల్డ్ బాండ్ ప్రైస్ హిస్టరీ చూస్తే సిరీస్ 10 ధర రూ.5,104, సిరీస్ 9 ధర రూ.5,000, సిరీస్ 8 ధర రూ.5,127, సిరీస్ 7 ధర రూ.5,051, సిరీస్ 6 ధర రూ.5,117 గా ఫిక్స్ చేసింది. ప్రతీసారి గోల్డ్ బాండ్ గ్రాము ధర రూ.5,000 కన్నా ఎక్కువే ఉండేది.
ఈసారి రూ.5,000 లోపు ధరను ఫిక్స్ చేసింది ఆర్బీఐ. ఈ సిరీస్‌లో ఒక గ్రాము గోల్డ్ బాండ్‌ను రూ.4,912 ధరకు కొనొచ్చు. ఆన్లైన్లో పేమెంట్ చేసేవారికి రూ.50 తక్కువకే గోల్డ్ బాండ్ లభిస్తుంది. రూ.4,862 ధరకు కొనొచ్చు. అంటే 10 గ్రాముల బంగారానికి రూ.48,620 చెల్లిస్తే చాలు. సావరిన్ గోల్డ్ బాండ్ స్వచ్ఛమైన బంగారంతో సమానం. ఒకసారి స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే హైదరాబాద్‌లో మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.49,800. ఈలెక్కన సావరిన్ గోల్డ్ బాండ్ మార్కెట్ ధర కన్నా తక్కువకే లభిస్తోంది. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది సరైన అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 11 అమ్మకాలు ఫిబ్రవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 5న ముగుస్తాయి. గోల్డ్ బాండ్స్ కొన్నవారికి ఫిబ్రవరి 9న సెటిల్మెంట్ చేస్తారు.
Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది
EPF Account: ఈపీఎఫ్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? అప్డేట్ చేయండిలా
మార్కెట్లో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించేందుకు 2015లో మోదీ ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో నెలకోసారి మొత్తం 12 సార్లు గోల్డ్ బాండ్స్ అమ్మకాలు ఉంటాయి.
వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు 20 కిలోల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతాయి.
సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉందో లెక్కించే అంతే ధర చెల్లిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి ప్రస్తుత సిరీస్‌లో రూ.4,86,200 చెల్లించి 100 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నాడనుకుందాం. 8 ఏళ్ల తర్వాత గ్రాము బంగారం ధర రూ.8,000 ఉందనుకుందాం. అంటే 100 గ్రాముల బంగారానికి రూ.8,00,000 తిరిగి వస్తుంది. అంతే రూ.4,86,200 ఇన్వెస్ట్ చేస్తే రూ.8,00,000 వస్తుంది. దీంతో పాటు ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆర్బీఐ. ఈ రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.
Petrol Price: ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత? ఈ నెంబర్‌కు SMS పంపితే తెలుస్తుంది
సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో గోల్డ్ బాండ్ అమ్మొచ్చు లేదా కొనొచ్చు. మీ దగ్గర ఉన్న బాండ్స్ అమ్మితే వచ్చే లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది.
మార్కెట్లో బంగారం కొంటే జీఎస్టీ కూడా చెల్లించాలి. గోల్డ్‌పైన 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఒకవేళ నగలు చేయిస్తే మేకింగ్ ఛార్జీల పైన 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి మార్కెట్లో కొనడం కన్నా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటేనే రేటు తక్కువ. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే చేతికి ఫిజికల్ గోల్డ్ రాదు. కేవలం బంగారంపైన పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్ ఓ మంచి అవకాశం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI 2019-20 ఆర్థిక నివేదిక ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు 37 దశల్లో రూ.9,652.78 విలువైన 30.98 టన్నుల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10 సార్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మితే రూ.2,316.37 విలువైన 6.13 టన్నులు కొన్నారు. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 11 అమ్మకాలు 2021 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య, సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1 నుంచి 5 వరకు జరుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme