హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sovereign Gold Bond: నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా?

Sovereign Gold Bond: నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా?

Sovereign Gold Bond: రేపటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా?
(ప్రతీకాత్మక చిత్రం)

Sovereign Gold Bond: రేపటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా? (ప్రతీకాత్మక చిత్రం)

Sovereign Gold Bond Scheme 2020-21 Series X | సావరిన్ గోల్డ్ బాండ్ కొనాలనుకునేవారికి మరో అవకాశం వచ్చింది. నేటి నుంచి ( జనవరి 11) సబ్‌స్క్రిప్షన్ మొదలుకాబోతోంది.

సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 10 అమ్మకాలు నేటి (జనవరి 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సేల్ జనవరి 15న ముగుస్తుంది. ఈ తేదీల్లో గోల్డ్ బాండ్స్ కొన్నవారికి 2021 జనవరి 19న బాండ్స్ సెటిల్ చేస్తారు. ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,104 గా ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మీరు 10 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే రూ.51,040 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో కొనేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 10 గ్రాముల బంగారాన్ని రూ.50,540 ధరకే కొనొచ్చు. సాధారణంగా మార్కెట్ ధరకన్నా సావరిన్ గోల్డ్ బాండ్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి ఈసారి మార్కెట్ ధర ఎక్కువ ఉందా? సావరిన్ గోల్డ్ బాండ్ ధర ఎక్కువగా ఉందా? అన్న విషయం ఓసారి చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జనవరి 8న సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేసింది. గ్రాముకు రూ.5,104 అని ప్రకటించింది. అంటే 10 గ్రాములకు రూ.51,040. అదే రోజున మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,800. అంటే మార్కెట్ ధర కన్నా సావరిన్ గోల్డ్ బాండ్ ధర తక్కువగానే ఉంది. కానీ అనూహ్యంగా గత మూడు రోజులుగా బంగారం ధరలు పడిపోతున్నాయి. మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,860 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,500. అంటే ఈ లెక్కన సావరిన్ గోల్డ్ బాండ్ కన్నా మార్కెట్‌లో దొరికే స్వచ్ఛమైన బంగారం ధర రేటు తక్కువగా ఉంది.

Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా... రిలయెన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ ఇవే

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? వెంటనే తీసుకోవచ్చు ఇలా

మరి ఈ టైమ్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ కొనడం కరెక్టా? లేక స్వచ్ఛమైన బంగారం కొనడం కరెక్టా? ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో కొనే బంగారానికి జీఎస్‌టీ కూడా చెల్లించాలి. గోల్డ్‌పైన 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఒకవేళ నగలు చేయిస్తే మేకింగ్ ఛార్జీల పైన 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి మార్కెట్‌లో కొనడం కన్నా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటేనే రేటు తక్కువ. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే చేతికి ఫిజికల్ గోల్డ్ రాదు. కేవలం బంగారంపైన పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్ ఓ మంచి అవకాశం.

దశాబ్దకాలంగా ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను తగ్గించేందుకు పేపర్ గోల్డ్ అంటే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను మోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లు అంటే ప్రతీ నెలకు ఓసారి గోల్డ్ బాండ్స్ అమ్మకాలు ఉంటాయి. ఎవరైనా సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు.

వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటీ సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు సావరిన్ గోల్డ్ బాండ్ కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు అయితే ఏకంగా 20 కిలోల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు.

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉందో లెక్కించే అంతే ధర చెల్లిస్తారు. అంటే ఇప్పుడు ఓ వ్యక్తి రూ.1,00,000 చెల్లించి 20 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నాడనుకుందాం. 8 ఏళ్ల తర్వాత గ్రాముకు రూ.7,000 ఉంటే ఆ వ్యక్తికి 20 గ్రాముల బంగారానికి రూ.1,40,000 వస్తాయి. దీంతో పాటు ప్రతీ ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో అమ్మొచ్చు. కొనొచ్చు. లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI 2019-20 ఆర్థిక నివేదిక ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు 37 దశల్లో రూ.9,652.78 విలువైన 30.98 టన్నుల సావరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10 సార్లు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మితే రూ.2,316.37 విలువైన 6.13 టన్నులు కొన్నారు. 2020-21 సిరీస్ 10 సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2021 జనవరి 11 నుంచి 15న ముగుస్తాయి. సిరీస్ 11 అమ్మకాలు 2021 ఫిబ్రవరి 1 నుంచి 5, సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1 నుంచి 5 వరకు జరుగుతాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛమైన బంగారానికి నిర్ణయించిన ధరలను బట్టి సావరిన్ గోల్డ్ బాండ్ ధరలు ఉంటాయి. స్వచ్ఛమైన బంగారానికి గత మూడు బిజినెస్ డేస్‌లో ఉన్న ధరని యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది ఆర్‌బీఐ.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme

ఉత్తమ కథలు