SOVEREIGN GOLD BOND SCHEME 2020 21 SERIES VIII SUBSCRIPTION TO OPEN ON NOVEMBER 9 RESERVE BANK OF INDIA RBI FIXED RS 52370 PER GRAM SS
Gold: ధంతేరాస్‌కు ముందు గోల్డెన్ ఛాన్స్... తక్కువ ధరకే బంగారం కొనండిలా
Gold: ధంతేరాస్‌కు ముందు గోల్డెన్ ఛాన్స్... తక్కువ ధరకే బంగారం కొనండిలా
(ప్రతీకాత్మక చిత్రం)
Sovereign Gold Bond Scheme 2020-21 Series VIII Subscription | ధంతేరాస్, దీపావళికి బంగారం కొనాలనుకునేవారికి అదిరిపోయే అవకాశమిది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనండి ఇలా.
దేశమంతా నవంబర్ 13న ధంతేరాస్ జరుపుకోబోతోంది. ధంతేరాస్ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భారతీయుల విశ్వాసం. అందుకే ధంతేరాస్ రోజున బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. నగల దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. దీపావళి సమయంలో కూడా నగల షాపుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ధంతేరాస్, దీపావళి కన్నా ముందు అద్భుతమైన అవకాశం రాబాతోంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బంగారం కొనే ఛాన్స్ ఇది. సావరిన్ గోల్డ్ బాండ్-SGB 2020-21 సిరీస్ అమ్మకాలు మొదలవుతున్నాయి. నవంబర్ 9న సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. నవంబర్ 13 వరకు కొనొచ్చు. నవంబర్ 13న ధంతేరాస్ పర్వదినం ఉందన్న సంగతి తెలిసిందే. ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ ధంతేరాస్ రోజున కూడా ఉండటం విశేషం.
మార్కెట్లో దొరికే స్వచ్ఛమైన బంగారం ధర కన్నా సావరిన్ గోల్డ్ బాండ్ ధర తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,370. కానీ ఈ ఇష్యూలో సావరిన్ గోల్డ్ బాండ్ 10 గ్రాములు తీసుకుంటే మీరు రూ.51,270 చెల్లిస్తే చాలు. ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధర ఒక గ్రాముకు రూ.5,177 గా ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఒకవేళ ఆన్లైన్లో కొంటే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.5,127 ధర చెల్లిస్తే చాలు. ధంతేరాస్, దీపావళి సమయానికి మార్కెట్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువ. కానీ సావరిన్ గోల్డ్ బాండ్ ధర ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఆ లెక్కన మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇక సావరిన్ గోల్డ్ బాండ్ విషయానికి వస్తే నగలు, బిస్కెట్ల రూపంలో కాకుండా సర్టిఫికెట్ రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ కన్నా బంగారంపై ఇన్వెస్ట్ చేసినట్టే. సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడికి 8 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీడీమ్ చేసుకునే సమయంలో లేదా మెచ్యూరిటీ సమయంలో ఆ రోజున బంగారం ధర ఎంత ఉంటుందో ఆ లెక్కన డబ్బులు చెల్లిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉదాహరణకు మీరు ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ ద్వారా 10 గ్రాములకు రూ.51,270 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రీడీమ్ లేదా మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర రూ.75,000 ఉంటే అప్పుడు మీకు రూ.75,000 వస్తాయి. దీంతో పాటు అదనంగా ఏడాదికి 2.5 శాతం వడ్డీని కూడా పొందొచ్చు. మెచ్యూరిటీ వరకు ఆగకుండా గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు.
మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఏ బ్యాంకులో అయినా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి సంస్థల్లో గోల్డ్ బాండ్స్ లభిస్తాయి. ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.