బంగారం కొని లాభాలు పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. 2020-21 సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ 6వ సబ్స్క్రిప్షన్ ఆగస్ట్ 31న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4 వరకు 5 రోజుల పాటు గోల్డ్ బాండ్ అమ్మకాలు కొనసాగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరి సబ్స్క్రిప్షన్. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు గోల్డ్ బాండ్స్ దొరకకపోవచ్చు. అందుకే బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఆఖరి అవకాశం కూడా. మార్కెట్ రేటు కన్నా సావరిన్ గోల్డ్ బాండ్లో బంగారం రేటు తక్కువగా ఉంటుంది. సుమారు 10 శాతం తక్కువకే గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. ఆగస్ట్ 31న ప్రారంభం కాబోయే సబ్స్క్రిప్షన్ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఫిక్స్ చేయనుంది. ఆన్లైన్లో కొంటే గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవల బంగారం రేటు బాగా పెరిగిపోవడంతో సావరిన్ గోల్డ్ బాండ్స్‌కి డిమాండ్ పెరిగింది.
Pension Scheme: ఈ పథకంలో 2.4 కోట్ల మంది చేరారు... నెలకు రూ.5,000 పెన్షన్ గ్యారెంటీ
LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందండి ఇలా
బంగారం అంటే భారతీయులకు పొదుపుతో పాటు పెట్టుబడి సాధనం కూడా. డబ్బు పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించడం కోసం బంగారాన్ని కొంటూ ఉంటారు. అయితే ఈ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొంటారు. దాచుకుంటారు. అయితే ఈ ఫిజికల్ గోల్డ్‌ని దాచుకోవడం ఓ పెద్ద సమస్య. అందుకే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2015న ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు ఉన్న డిమాండ్ తగ్గించడం కూడా ఓ కారణం. సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయి. గోల్డ్ బాండ్స్‌ని బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కొనొచ్చు.
Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?
PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా
ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. మైనర్ పేరు మీదా ఈ బాండ్ తీసుకోవచ్చు. రూ.20,000 వరకు నగదు, అంతకన్నా ఎక్కువైతే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. మీరు ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎలాంటి కేవైసీ నిబంధనలు ఉంటాయో అవే గోల్డ్ బాండ్స్ కొనడానికీ వర్తిస్తాయి. ప్రతీ దరఖాస్తుపైన ఇన్వెస్టర్ పాన్ నెంబర్ తప్పనిసరి.
గోల్డ్ బాండ్స్ కూడా ఓ పెట్టుబడి సాధనమే. వీటిని డిమాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటిని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించే గోల్డ్ లోన్‌కు సమానంతో గోల్డ్ బాండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి బాండ్ కొంటే ఎనిమిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు ఉన్న బంగారం ధరతో సమానంగా తిరిగి చెల్లిస్తారు. దాంతోపాటు వడ్డీ కూడా లభిస్తుంది. గోల్డ్ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై సంవత్సరానికి నామమాత్రపు విలువపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. బాండ్ జారీ చేసిన ఐదో ఏట అవసరం అనుకుంటే... బాండ్ ఇచ్చేసి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Investment Plans, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme