సావరిన్ గోల్డ్ బాండ్... బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఓ ఆప్షన్ ఇది. ఫిజికల్ గోల్డ్ కొనకుండా బాండ్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిరీస్ 1 గోల్డ్ బాండ్స్‌ను ఏప్రిల్ 20 నుంచి 23 వరకు అమ్మింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈ గోల్డ్ బాండ్లకు ప్రజల నుంచి భారీ డిమాండ్ కనిపించింది. ఏకంగా రూ.822 కోట్లు చెల్లించి 17.73 లక్షల యూనిట్ల గోల్డ్ బాండ్స్‌ని కొనేశారు. 2016 అక్టోబర్‌లో మొదటిసారి గోల్డ్ బాండ్స్ జారీ చేసినప్పుడు మాత్రమే ఇంత డిమాండ్ కనిపించింది. అప్పుడు 35.98 లక్షల యూనిట్లను రూ.1,081 కోట్లతో కొన్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు గోల్డ్ బాండ్స్‌పై ప్రజల్లో అంత ఆసక్తి కనిపించలేదు. 2016 అక్టోబర్ తర్వాత అంత భారీ స్థాయిలో గోల్డ్ బాండ్స్ కొనడం ఇదే మొదటిసారి.
గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెడితే ఫిక్స్‌డ్ గ్యారెంటీ ఇంట్రెస్ట్ కూడా వస్తుండటంతో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనేందుకు ఆసక్తి చూపించారు ఇన్వెస్టర్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి సిరీస్ గోల్డ్ బాండ్స్‌లో ఒక గ్రాము బంగారానికి రూ.4,639 ధర ఫిక్స్ చేసింది ఆర్‌బీఐ. ధర ఎక్కువగానే ఉన్నా డిమాండ్ పెరిగింది తప్ప తగ్గలేదు. భారతదేశంలో బంగారానికి ఉన్న సెంటిమెంట్ అలాంటిది మరి. ఇప్పటికీ గోల్డ్ బాండ్స్‌పై ప్రజల్లో అవగాహన తక్కువే. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ బాండ్స్ చాలా రకాలుగా మేలు చేస్తుంది. గోల్డ్ బాండ్స్‌తో వచ్చే లాభాలేంటో, మళ్లీ రెండో సిరీస్ ఎప్పుడు అమ్ముతారో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... తులం ఎంతంటే
Loan: రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు... ఆ స్కీమ్‌లో ఉన్నవారికే అవకాశం
PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండిPublished by:Santhosh Kumar S
First published:May 06, 2020, 17:51 IST