ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.47,000 ధరకు దగ్గర్లో ఉంది. త్వరలో రూ.50,000 ధరకు చేరుకునే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. కొందరు నిపుణుల అంచనా ప్రకారం సరిగ్గా ఏడాదిలో బంగారం ధర రూ.54,000 ధరకు చేరుకోవచ్చని అంచనా. మరి మీరు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదించాలనుకుంటున్నారా? సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో మీకు మంచి అవకాశం లభిస్తోంది. ఇటీవల గోల్డ్ బాండ్స్‌కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. మే 11 నుంచి 15 వరకు మరోసారి గోల్డ్ బాండ్స్‌ని అమ్మింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈసారి ఏకంగా రూ.1,168 కోట్ల విలువైన 25 లక్షల యూనిట్స్ గోల్డ్ బాండ్స్‌ని కొన్నారు ఇన్వెస్టర్లు. ఈసారి ఒక యూనిట్‌కు రూ.4,590 ధర నిర్ణయించింది ఆర్బీఐ. సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ ప్రారంభమైననాటి నుంచి లెక్కలు చూస్తే ఈసారే ఎక్కువ డిమాండ్ కనిపించింది. 2016 అక్టోబర్‌లో రూ.1,082 విలువైన 35.98 యూనిట్లను కొన్నారు ఇన్వెస్టర్లు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా గోల్డ్ బాండ్స్‌కి మంచి డిమాండ్ కనిపించింది. ఏకంగా రూ.822 కోట్ల రూపాయల విలువైన 17.73 లక్షల గోల్డ్ బాండ్స్‌ని అమ్మింది ఆర్బీఐ. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గోల్డ్ బాండ్ రూపంలో మంచి అవకాశం ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ కాకుండా బాండ్స్ రూపంలో గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయొచ్చు. బంగారంపై గత ఏడాదిలో 40 శాతం రిటర్న్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాండ్ కొనడం వల్ల లాభమేంటో తెలుసుకునేందుకుఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఈ ఏడాది జూన్ 8 నుంచి 12 మధ్య సిరీస్ 3, జూలై 6 నుంచి 10 మధ్య సిరీస్ 4, ఆగస్ట్ 3 నుంచి 7 మధ్య సిరీస్ 5, ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 4 మధ్య సిరీస్ 6 గోల్డ్ బాండ్లను అమ్మనుంది ఆర్బీఐ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.