Home /News /business /

SOVEREIGN GOLD BOND MODI GOVERNMENT IS GIVING A CHANCE TO BUY GOLD CHEAPLY MK

Sovereign Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం కొనాలని ఉందా...అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ బాండ్స్ కొనుగోలు చేయండిలా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను తొమ్మిదో సిరీస్ 2021-22 సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) జారీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమైంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్​బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ 2021-22 , తొమ్మిదవ సిరీస్ జనవరి 10, సోమవారం ప్రారంభం కానుంది. జనవరి 14 వరకు ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంకా చదవండి ...
    ఈ ఆర్థిక సంవత్సరానికి గాను తొమ్మిదో సిరీస్ 2021-22 సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) జారీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమైంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్​బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ 2021-22 , తొమ్మిదవ సిరీస్ జనవరి 10, సోమవారం ప్రారంభం కానుంది. జనవరి 14 వరకు ఈ బాండ్స్  కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొనుగోలు చేసిన గోల్డ్ బాండ్లకు (Gold Bonds) సర్టిఫికెట్​ జారీ చేస్తారు. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం (Gold Price) కొనడానికి ఇది మంచి అవకాశం. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్స్ సరైన ఆప్షన్. సావరిన్ గోల్డ్ బాండ్ 2021-22 తొమ్మిదో సిరీస్ ఇష్యూ ధర గ్రాముకు రూ.4,786గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రభుత్వం సిరీస్ 8వ ఇష్యూ ధరను గ్రాముకు రూ. 5 తగ్గించింది. ఎనిమిదో సిరీస్‌కి సంబంధించిన ఇష్యూ ధర గ్రాముకు రూ.4,791గా నిర్ణయించారు.

    సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎందుకు కొనాలి..
    సావరిన్ గోల్డ్ బాండ్లను భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం తరపున ఆర్​బీఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసేవారు, వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.

    ఆన్‌లైన్ కొనుగోలుదారులు ప్రత్యేక డిస్కౌంట్...
    భారత ప్రభుత్వం, ఆర్‌బిఐతో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్ మార్గాల ద్వారా చెల్లించే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే అటువంటి పెట్టుబడిదారులు గ్రాముకు రూ.4,736 ధరతో ఈ బాండ్ పొందుతారు.

    సావరిన్ గోల్డ్ బాండ్ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి
    సావరిన్ గోల్డ్ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL), ఎంపిక చేసిన పోస్టాఫీసులు , స్టాక్ ఎక్స్ఛేంజీలు - NSE , BSE ద్వారా విక్రయిస్తారు.

    చాలా వడ్డీ పొందుతారు
    సావరిన్ గోల్డ్ బాండ్ 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. తదుపరి వడ్డీ చెల్లింపు తేదీలో 5 సంవత్సరాల తర్వాత బాండ్ నుండి పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇష్యూకి ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి 6 నెలలకు మీ ఖాతాలో జమ అవుతుంది.

    పెట్టుబడి సీలింగ్
    సావరిన్ గోల్డ్ బాండ్ పథకం కింద, ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో, కనీసం ఒక గ్రాము పెట్టుబడిని కలిగి ఉండటం అవసరం. అదే సమయంలో, ట్రస్టులు లేదా సారూప్య సంస్థలు 20 కిలోల వరకు బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

    ఎస్​జీబీ ప్రయోజనాలు ఏంటి?
    ఎస్​జీబీల్లో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే, బంగారం విషయంలో ఇరత ఛార్జీలు, స్వచ్ఛత వంటి సమస్యల ఉండవు. ఇవి కాకుండా, ఎస్​జీబీలను ఆర్​బీఐ డీమ్యాట్ రూపంలో నిర్వహిస్తారు.

    ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
    ఎ) విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 కింద భారతదేశంలో నివసించే ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.
    బి) హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్​యూఎఫ్​), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు.
    సి) మైనర్ల తరపున వారి సంరక్షకులు మైనర్ ఎస్​జీబీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Sovereign Gold Bond Scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు