Bank News | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సౌత్ ఇండియన్ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్ - MCLR )ను పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారిపై డా ఎఫెక్ట్ ఉంటుంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ రుణ రేట్ల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వస్తుంది. రుణ రేట్లు పెరగడం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ వంటి వాటి ఈఎంఐలు పైకి చేరనున్నాయి. అలాగే పర్సనల్ లోన్స్ ప్రియం కాబోతున్నాయి. బ్యాంక్ రుణ రేట్లు పెంచడం ఇది వరుసగా ఈ ఏడాదిలో రెండో సారి. చివరిగా బ్యాంక్ జనవరి 20న ఎంసీఎల్ఆర్ పెంచేసింది. మళ్లీ ఇప్పుడు రుణ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది.
రూ.700కు పైగా పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.1,300 పతనం.. అంతలోనే షాక్..
బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతానికి చేరింది. ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.7 శాతానికి ఎగసింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.8 శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 9 శాతానికి చేరింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.35 శాతానికి ఎగసింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర పెంచిందని చెప్పుకోవచ్చు.
గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.. 6 అదిరే ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!
కొత్త రుణ రేట్లు ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతంగా కొనసాగుతోంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతంగా కొనసాగుతోంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 9.2 శాతంగా ఉంది.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచడం వల్ల బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ , బ్యాంక్ ఆఫ్ బరోడా సహా చాలా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటుపు పెంచేశాయి. ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారిపై, తీసుకున్న వారిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలో పయనించే అవకాశం ఉంది. దీంతో రుణ గ్రహీతలపై ప్రభావం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, EMI, Home loans, Money