Interest Rates | ప్రైవేట్ రంగానికి ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సౌత్ ఇండియన్ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ (Bank) రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచేసింది. ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 29 నుంచి అమలులోకి వస్తుంది.
బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్లకు 2.65 శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే బ్యాంక్ 3.15 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ కస్టమర్లకు ఊరట.. బ్యాంక్ యూనియన్ల కీలక నిర్ణయం!
7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై అయితే బ్యాంక్ 2.65 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 31 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై అయితే బ్యాంక్ 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 91 రోజుల నుంచి 99 రోజుల ఎఫ్‌డీలపైఅ యితే 4.25 శాతం వడ్డీ వస్తోంది. 100 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. 101 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 4.25 శాతం వడ్డీ ఉంది. 181 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.6 శాతంగా కొనసాగుతోంది. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. ఏడాది 2 రోజుల నుంచి 499 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఏడాది ఒక్క రోజు ఎఫ్‌డీలపై అయితే 7 శాతం వడ్డీ వస్తుంది. 500 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇక వారికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!
501 రోజుల నుంచి 30 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. 30 నెలల ఎఫ్‌డీలపై వడ్డీర టు 7 శాతంగా లభిస్తుంది. 30 నెలల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. 5 ఏళ్ల నుంచి 66 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. 66 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా కొనసాగుతోంది. 66 నెలల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతంగా లభిస్తోంది. ఇకపోతే బ్యాంక్ డిసెంబర్ నెల త్రైమాసిక ఫలితాలు అదిరిపోయాయి. బ్యాంక్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నికర వడ్డీ ఆదాయం రూ.825 కోట్లను నమోదు చేసింది. కాాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు అన్నీ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, FD rates, Fixed deposits, Money