దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను పొడిగించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి నెలల్లో 18 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railways) ప్రకటించింది. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు చూస్తే రైలు నెంబర్ 07605 తిరుపతి నుంచి అకోలా రూట్‌లో ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రూట్‌లో ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.
IRCTC Valentine Special Tour: వాలెంటైన్స్ డే స్పెషల్... ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
రైలు నెంబర్ 07643 హైదరాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 23 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07644 తిరుపతి నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 24 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07698 విజయవాడ నుంచి నాగర్‌సోల్ రూట్‌లో ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07699 నాగర్‌సోల్ నుంచి విజయవాడ రూట్‌లో ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07445 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి రూట్‌లో ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07446 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ రూట్‌లో ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
Train in Snow: మంచులో రైలు ప్రయాణం అద్భుతం... ఫోటోస్ ఇక్కడ చూడండి
రైలు నెంబర్ 07185 మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07186 సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07481 తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 ఫిబ్రవరి 5 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07482 సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 ఫిబ్రవరి 6 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07067 మచిలీపట్నం నుంచి కర్నూల్ సిటీ రూట్‌లో ప్రతీ శనివారం, మంగళవారం, గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 19 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07068 కర్నూల్ సిటీ నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
రైలు నెంబర్ 07095 మచిలీపట్నం నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 18 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07096 తిరుపతి నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 19 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Special Trains, Tirupati, Vijayawada