Home /News /business /

SOUTH CENTRAL RAILWAY RESPONDED OVER TELANGANA MINISTER KTR TWEET ON PLATFORM TICKET AT SECUNDERABAD STATION NS

Minister KTR: మంత్రి కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన రైల్వే.. సికింద్రాబాద్ స్టేషన్లో రూ. 500 పార్కింగ్ ఫీజుపై క్లారిటీ

మంత్రి కేటీఆర్ ఫైల్ ఫొటో(ఫొటో: ట్విట్టర్)

మంత్రి కేటీఆర్ ఫైల్ ఫొటో(ఫొటో: ట్విట్టర్)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో(Secunderabad Railway Station) పార్కింగ్ ఫీజు అంశంపై దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) స్పందించింది. స్టేషన్లో పార్కింగ్ ఫీజుపై క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad Railway Station) పార్కింగ్ కు రూ. 500 వసూలు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్(Viral) గా మారిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు ఇదేం అన్యాయం అంటూ రైల్వే(Indian Railway)ను ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిగేడియర్ జైరత్ అనే మీజీ సైనిక ఉద్యోగి తన కారును 31 నిమిషాలు పార్కింగ్(Parking) చేసినందుకు రైల్వే సిబ్బంది రూ. 500 వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన రశీదును ట్విట్టర్ లో పోస్టు చేశాడు. పార్కింగ్ బిల్‎ను జైరత్ పురపాల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కు ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్‌కు మంత్రి సైతం స్పందించారు. ఇది నిజంగా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్విట్టర్ ద్వారా కోరారు మంత్రి కేటీఆర్. ఏకంగా కేటీఆర్ స్పందించడంతో ఈ వార్త వైరల్ గా మారింది. రైల్వేపై సామాన్యులు దుమ్మెత్తి పోశారు. ఇలా అయితే బతికేదెలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అయితే ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) స్పందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 500 పార్కింగ్ ఫీజును వసూలు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది దక్షిణ మధ్య రైల్వే. అనవసర రద్దీని నివరించడానికి ఓవర్ స్టే పార్కింగ్ ఫీజును మాత్రం వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. టూ వీలర్ పార్కింగ్ కు మొదటి రెండు గంటలకు రూ. 15 రూపాయలు పార్కింగ్ ఛార్జి అని, 4 వీలర్ కు మొదటి రెండు గంటలకు పార్కింగ్ ఛార్జి రూ. 50 అంటూ స్పష్టం చేసింది. అయితే స్టేషన్ లో జనాలు సంచరించే ప్రాంతంలో అనాధికారికంగా పార్కింగ్ చేయవద్దని ప్రయాణికులకు సూచించింది.

    TSRTC: టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. పెరగనున్న చార్జీలు.. ఏ బస్సుకు ఎంత..? వివరాలిలా..





    -ఎక్కువ సేపు అనధికారికంగా స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
    Telangana Government Jobs: గుడ్ న్యూస్.. ఈ సారి 80 వేల ఉద్యోగాల భర్తీ పక్కా..! అందుకే ఈ కమిటీ..

    ఆ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
    -8 నిమిషాల వరకు స్టేషన్ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.
    -8 నుంచి 10 నిమిషాల వరకు రూ. 100 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
    -16-30 నిమిషాల వరకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
    -30 నిమిషాలు దాటిన తర్వాత అనధికార పార్కింగ్ కు రూ. 500 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Indian Railways, Minister ktr, Secunderabad railway station, South Central Railways

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు