హోమ్ /వార్తలు /బిజినెస్ /

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ, గుంటూరు, డోన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఈ రైళ్లు రద్దు.. వివరాలివే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ, గుంటూరు, డోన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఈ రైళ్లు రద్దు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డోన్, గుంటూరు, కాచిగూడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. 4 రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. డోన్, గుంటూరు, కాచిగూడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. నాన్ ఇంటర్ లాకింగ్ వర్క్స్ కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఇంకా మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సైతం ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

- Train No.17228: గుంటూరు నుంచి డోన్ వరకు రాకపోకలు సాగించే ఈ రైలును ఈ నెల 12వ తేదీ నుంచి 19 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.

- Train No.17227: డోన్ నుంచి గుంటూరు వరకు రాకపోకలు సాగించే రైలును ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Railways: ఇక రైల్వే స్టేషన్లలో కొత్త సర్వీసులు.. ఓ లుక్కేయండి!

- Train No.17251: గుంటూరు-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Train No.17252: కాచిగూడ-గుంటూరు ట్రైన్ ను సైతం అధికారులు రద్దు చేశారు. ఈ ట్రైన్ ఈ నెల 17వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు సేవలను అందించదు.

- Train No.07889: రేపల్లె-మార్కాపూర్ ట్రైన్ ను ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ను దొనకొండ-మార్కాపూర్ రోడ్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దీంతో గజ్జలకొండ, మార్కాపూర్ రోడ్ వద్ద ట్రైన్ ఆగదు.

- Train No.07890: మార్కాపూర్ రోడ్-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దొనకొండ-మార్కాపూర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు అధికారులు. దీంతో మార్కాపూర్ రోడ్, గజ్జల కొండ వద్ద ట్రైన్ ఆగదు.

పలు స్పెషల్ ట్రైన్ల ప్రకటన:

- Train No.07265: హైదరాబాద్-యశ్వంతపూర్ మధ్య ఈ నెల 28, 25 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

- Train No.07266: యశ్వంతపూర్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్లను ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 05:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

First published:

Tags: Indian Railways, South Central Railways, Trains cancelled

ఉత్తమ కథలు