కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం (Agnipath Scheme) విషయంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ (Secunderabad Railway Station) అట్టుకుడుకుతున్న విషయం తెలిసిందే. దీంతో స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ప్రారంభించింది. ప్రయాణికులు ట్రైన్ల రద్దు తదితర సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నంబర్ 040-27786666 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Train Station)లో హింసాత్మక ఘటనలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. అక్కడి పరిస్థితులను చూస్తే అర్ధమవుతోందని.. రైల్వే సిబ్బంది చెబుతున్నారు. కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బాంబులను విసిరారు. బోగీల్లో ప్రయాణికులు ఉన్న సమయంలోనే పెట్రోల్ బాంబుల(Petrol Bombs)ను, రాళ్లను విసరడంతో.. వారంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
తమ వెంట తెచ్చుకున్న సామాను, వస్తువులను అక్కడే వదిలిపెట్టి.. పారిపోయారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సీఎన్ఎన్-న్యూస్ 18 ప్రతినిధి.. దగ్ధమైన ఓ రైలులోకి వెళ్లారు. అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. మంటల్లో కాలిపోయిన ఆ రైలులో అన్నీ బోగీలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడే తమ వస్తువులను వదిలిపెట్టి పారిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఓ సీటుపై పెట్రోల్ బాంబు కూడా కనిపించింది. ఆందోళనకారులో చాలా మంది విద్యార్థుల్లా కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Agnipath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటీ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎందుకీ విధ్వంసం?
#Helpline Number at #Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/BIlM1J10MX
— South Central Railway (@SCRailwayIndia) June 17, 2022
విద్యార్థులైతే కర్రలు, ఐరన్ రాడ్లతో స్టేషన్‌లో ఎందుకు దాడులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో ఉన్న షాపులను లూటీ చేశారని.. పెద్ద మొత్తంలో డబ్బులు ఎత్తుకెళ్లారని షాపుల యజమానులు చెప్పారు. తమపై కర్రలతో దాడి చేసినట్లు వారు వెల్లడించారు. అది అల్లరి మూకల పనిగా అనిపిస్తోందని.. పక్కా ప్లాన్‌తోనే ఇంతటి విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆందోళనకారుల్లో చాలా మంది ఐరన్ రాడ్లతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. పోలీసులపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Protest, Agnipath Scheme, Indian Railways, Secunderabad railway station, South Central Railways